ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా రైతులకు రాయితీలు

ABN, First Publish Date - 2020-10-04T07:25:10+05:30

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ఆక్వా రైతులు కొత్తగా హేచరీస్‌ నిర్మిం చుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నట్టు మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, అక్టోబరు 3 : ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ఆక్వా రైతులు కొత్తగా హేచరీస్‌ నిర్మిం చుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నట్టు మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ తెలిపారు.  జేడీ కార్యాలయంలో శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 40 నుంచి 60 శాతం వరకు సబ్సిడీ  లభిస్తుందన్నారు. యూనిట్‌ స్థాపించే వారు సబ్సిడీ పోను మిగిలిన మొత్తానికి బ్యాంక్‌ నుంచి రుణం తీసుకోవచ్చునన్నారు. వడ్డీ కేవలం మూడు శాతం మాత్రమే రైతులు కట్టాల్సి ఉంటుందన్నారు. ఈ పథకంలో కొత్తగా చేపలు, రొయ్యలకు సంబంధించి హేచరీస్‌ను నిర్మించుకోవచ్చునన్నారు.


చేపలు రిటైల్‌ మార్కెట్‌ చేసుకునేందుకు వాహనాలకు సబ్సిడీ ఇస్తుందన్నారు. తీర ప్రాంత మత్స్యకారులకు బోట్లు, వలలు సరఫరా చేస్తామన్నారు. ఫిష్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా మత్స్య రైతులు కొంత మంది ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడవచ్చునన్నారు. ఈ ఆర్గనైజేషన్‌ ద్వారా వారు పండించిన ఆక్వా పంటలను వారే కొనుగోలు చేసుకుని ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ఏర్పాటు చేసిన మత్స్య మార్కెట్లో అమ్ముకోవచ్చునన్నారు. కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేసుకోవడానికి రూ. 2 కోట్లు వరకూ ప్రభుత్వం లోన్‌ ఇస్తుందని దానిలో 40 శాతం 60 శాతం వరకూ కూడా సబ్సిడీ ఇస్తామన్నారు.  

Updated Date - 2020-10-04T07:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising