గాంధీ మార్గంలో నడవాలి : సీతారం ఏచూరి
ABN, First Publish Date - 2020-10-03T09:43:58+05:30
గాంధీ మార్గంలో నేటి యువతరం నడవాలని సీపీఐ జాతీయ నాయ కుడు సీతారాం ఏచూరి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు.
ఏలూరు రూరల్, అక్టోబరు 2 : గాంధీ మార్గంలో నేటి యువతరం నడవాలని సీపీఐ జాతీయ నాయ కుడు సీతారాం ఏచూరి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఏలూరు సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వడ్లపట్ల సాయిశరత్ ఆధ్వర్యంలో గాంధీ జయ ంతిని పురస్కరించుకుని శుక్రవారం గాంధీజీ పట్ల మనం చూపిస్తున్న గౌరవం ఎంత వరకూ నిజం, గాంధీ విలువలు అనే అంశంపై జూమ్‌యాప్ వేదికగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
సీతారాం ఏచూరి మాట్లాడుతూ విలువలతో కూడి జీవించడమే గాంధీజీకి నిజమైన నివాళి అన్నారు. జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీని అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.స్వాతంత్య్ర సమరయోధుడు చింతలపల్లి వెంకటనారాయణ గాంధీజీ జీవితం ఆదర్శనీయమన్నారు. తొలుత క్లబ్ సభ్యులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లబ్ మాజీ గవర్నర్ కృష్ణంరాజు, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-03T09:43:58+05:30 IST