ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీ ద్వారానే కేసులకు.. సత్వర పరిష్కారం

ABN, First Publish Date - 2020-10-01T10:45:34+05:30

జీవితంలో ఎన్నో అవకాశా లు వస్తుంటాయని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకు న్నప్పుడే సుఖసంతోషాలతో జీవించగలరని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. ఎటువంటి కక్షలు, ద్వేషం పెంచుకోకుండా కక్షిదారులు తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వర్చువల్‌ అదాలత్‌ ప్రారంభించిన జిల్లా జడ్జి భీమారావు


ఏలూరు క్రైం, సెప్టెంబరు 30 : జీవితంలో ఎన్నో అవకాశా లు వస్తుంటాయని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకు న్నప్పుడే సుఖసంతోషాలతో జీవించగలరని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. ఎటువంటి కక్షలు, ద్వేషం పెంచుకోకుండా కక్షిదారులు తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవ రణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో వర్చు వల్‌ లోక్‌ అదాలత్‌ను జడ్జి భీమారావు బుధవారం ప్రారంభిం చారు.


రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తికి సంబంధిం చిన కేసులో వీడియో కాలింగ్‌ ద్వారా బాధితులతో జిల్లా జడ్జి భీమారావు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి మాట్లాడి వారి అనుమతితో కేసు పరిష్కరించారు. భీమారావు మాట్లాడుతూ ఇప్పటివరకూ లోక్‌ అదాలత్‌ బెంచ్‌ల్లో కక్షిదారులు ప్రత్యక్షంగా హాజరై తమ అంగీకారం తెలియజేసేవారని ప్రస్తుతం కరోనా  నేపథ్యంలో వీడియో కాలింగ్‌ ద్వారా కక్షిదారులు తమ అంగీ కారం తెలియజేసి కేసులను పరిష్కరించుకోవడానికి వర్చు వల్‌ లోక్‌ అదాలత్‌ ఉపయోగపడుతుందన్నారు.


మొదటి అద నపు జిల్లా జడ్జి మల్లికార్జునరావు, ఏలూరు బార్‌ అధ్యక్షుడు అబ్బినేని విజయకుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ అవసరమన్నారు. రెండో అదనపు జిల్లా జడ్జి ప్రభాకరరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ ఛార్జి కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T10:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising