ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు మన్యం బంద్‌

ABN, First Publish Date - 2020-09-28T11:49:25+05:30

ఆంధ్రా, తెలంగాణ మన్యం బంద్‌ను ఈ నెల 29న జయప్రదం చేయాలని సీపీఎం ఏపీ గిరిజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం సీపీఎం పోలవరం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, సెప్టెంబరు 27:  ఆంధ్రా, తెలంగాణ మన్యం బంద్‌ను ఈ నెల 29న  జయప్రదం చేయాలని సీపీఎం ఏపీ గిరిజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం సీపీఎం పోలవరం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారాలు అందించి పునరావాసం కల్పిం చాలని, జీవో నెం.3ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.


నాన్‌షెడ్యూల్‌ ఏరియాల్లో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతాల్లోకి తీసుకురావాలని కోరుతూ ఈ నెల 29న ఆంధ్రా, తెలంగాణ మన్యం ప్రాంతాల్లో జరగనున్న బంద్‌ని ప్రజానీకం వ్యాపార, వర్తక సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు జయప్రదం చేయాలని కోరారు. ఏపీ గిరిజన సంఘం పోలవరం మండల కార్యదర్శి గొరగం భూచంద్రం మాట్లా డుతూ ప్రతీ గిరిజనుడికి పది ఎకరాలు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-28T11:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising