ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగానికి సగం

ABN, First Publish Date - 2020-06-05T11:22:41+05:30

కొబ్బరికాయ ధర రూ.6కు పడి పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. లాక్‌డౌన్‌కు ముం దు వెయ్యి కాయల ధర రూ.12..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌కు ముందు కొబ్బరికాయ రూ.12.. ప్రస్తుతం రూ.6 

భారీగా పడిపోయిన  ధర.. దింపు ఖర్చులూ రాని వైనం

50 శాతం తగ్గిన దిగుబడి.. కొబ్బరి రైతుకు కష్టకాలం 


యలమంచిలి, జూన్‌ 4 : కొబ్బరికాయ ధర రూ.6కు పడి పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. లాక్‌డౌన్‌కు ముం దు వెయ్యి కాయల ధర రూ.12 వేలు ఉండేది. ఆ సమయం లో ఎగుమతులు నిలిచిపోవడంతో రెండు నెలలపాటు కొబ్బరి కొనేవారు లేకపోవడంతో కాయలను కోయకుండా చెట్లపైనే వదిలివేశారు. లాక్‌డౌన్‌ సడలింపుతో ఎగుమతులు 40 శాతం  ప్రారంభమయ్యాయి. వెయ్యి కాయల ధర రూ.6000లకు పడి పోయింది. దింపు కూలీల ఖర్చులు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. కొబ్బరి దింపునకు కాయ ఒకటికి దింపు కార్మికుడికి రూ.1.50 ఇవ్వాలి. కాయలు చేరవేసే కూలీలకు మనిషికి రోజుకి రూ.600 చెల్లించాలి. ఎకరం తోటకు నెలన్నర రోజులకు సుమారు 800 కాయల దిగుబడి వస్తుది.


ప్రస్తుతం 400 కాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. కొబ్బరి పంటకు పెట్టు బడి పెట్టాలంటే అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపో తున్నారు. పాలకొల్లు పరిసర ప్రాంతాల నుంచి గతంలో సు మారుగా రోజుకి వంద లారీలు వరకు ఢిల్లీ, మహరాష్ట్ర, గుజ రాత్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు జరుగుతుండేవి. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రోజుకు 40 లారీలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పండుగలు, పెళ్లుళ్లు, దేవాలయాల్లో కొబ్బరి కాయల వినియోగం లాక్‌డౌన్‌తో పూర్తిగా తగ్గిపోయింది.  ‘కొబ్బరి రైతులకు నేడు కనీస పెట్టుబడులు రావడం లేదు.


తోటకు నీరు తోడించడం, దుక్కి దున్నడం, చెట్లకు ఎరువులు వేయడం వంటి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఏడాది పొడవునా కొబ్బరి కాయ ధర నిలకడగా ఉంటేనే గిట్టుబాటు అవుతుంది’ అని కొబ్బరి రైతు తమ్మినీడి విష్ణుమూర్తి చెబు తున్నారు. ‘దింపు తీయాలంటే కూలీల ఖర్చు.. ధర లేకపోవ డంతో చెట్లపైనే వదిలేస్తున్నాం. కనీస గిట్టుబాటు ధర లభించ కపోవడంతో దింపు తీసినా అమ్మలేకపోతున్నాం. రెండు నెల లుగా దేవాలయాలు మూతపడడం, శుభకార్యాలు జరగపోవ డంతో చిల్లరగా అమ్మే వారు కొనుగోలుకు రావడం లేదు’ శిరగాలపల్లికి చెందిన కొబ్బరి రైతు సీహెచ్‌ బాలాజీ చెప్పారు. 

Updated Date - 2020-06-05T11:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising