ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలపై దాడులను అరికట్టడంలో జగన్‌ ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2020-09-14T10:37:27+05:30

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరి కట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారంటూ టీడీపీ ఆధ్వర్యంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు


ఏలూరు ఫైర్‌స్టేషన్‌/పాలకొల్లు అర్బన్‌/ దేవరపల్లి/భీమడోలు, సెప్టెం బరు 13: రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరి కట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారంటూ టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు తెలిపా రు. ఏలూరు పవర్‌పేట సూర్యభగవాన్‌ ఆలయంలో జగన్‌కు కనువిప్పు కలగాలని ప్రార్థిస్తూ టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధా కృష్ణయ్య (చంటి) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. అంతర్వేది రథాన్ని తగల బెడితే ఎవరో పిచ్చోడు చేశాడని ప్రజలను నమ్మిస్తున్నారన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయ సమన్వయ కార్య దర్శి పాలి ప్రసాద్‌, నగర అధ్యక్షులు కొల్లేపల్లి రాజు, దాకారపు రాజేశ్వర రావు, ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు, బి.రామ్మోహనరావు, సంధ్య పాల్గొన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి దుర్మార్గపు చర్యలను అరికట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామా నాయు డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ఆదివారం  పాలకొల్లు కోడిగట్టున ఉన్న శ్రీసూర్యనారాయణ మూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.   దేవరపల్లి మండలం బందపురం సూర్యదేవాలయంలో ఆలయాలపై దాడులకు నిరసనగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నిర్వహించారు. ముప్పి డి మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్వంస శక్తులు పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసాలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌  సత్య నారాయణ, సుంకర దుర్గారావు పాల్గొన్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఏలూరు గోదావరి కాల్వలో సూర్య నమస్కారాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశా రు. భీమడోలు జంక్షన్‌లోని వేంకటేశ్వరస్వామి రూపక దేవాలయంలో  పూజలు నిర్వహించారు.  


పోడూరు :  అంతర్వేది రఽథం దగ్ధంపై విచారణను వేగవంతం చేయా లని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గణపతినీడి రాంబాబు, పోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మాజీ జడ్పీటీసీ బొక్కా నాగేశ్వరరావు, ఆచంట ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రుద్ర రాజు సీతారామరాజు(రవి) ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. ఇటీవల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనేక ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 


పోలవరం : అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీ డీపీ పోలవరం మండల అధ్యక్షుడు పాపోలు గణపతి రత్తయ్య డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Updated Date - 2020-09-14T10:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising