ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకివీడు చేపల మార్కెట్‌ బంద్‌

ABN, First Publish Date - 2020-06-05T11:28:16+05:30

కరోనా అన్ని రంగాలనూ దెబ్బతీసింది. ఒక పక్క ప్రభు త్వం లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా ఇంకా తేరుకోలేదు. ప్రస్తుతం ఆకివీడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెలాఖరు వరకూ మూసివేస్తున్నట్టు ప్రకటన


ఆకివీడు, జూన్‌ 4: కరోనా అన్ని రంగాలనూ దెబ్బతీసింది. ఒక పక్క ప్రభు త్వం లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా ఇంకా తేరుకోలేదు. ప్రస్తుతం ఆకివీడు మార్కె ట్‌దీ ఇదే పరిస్థితి. గతంలో ఆకివీడు మార్కెట్‌ నిత్యం వ్యాపారులతో కళ కళలా డుతూ ఉండేది. ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. దీంతో ఆకివీడు చేపల మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. రవాణా సదుపాయం అంతగా మెరుగుపడక పోవడం.. కరోనా భయం కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు ఆకివీడు చేపల మార్కెట్‌కు రావడం లేదు.


దీంతో హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌  ఖాళీగా దర్శనమిస్తోంది. దీంతో ఈ నెలాఖరు వరకు మార్కెట్‌ మూసివేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు షేక్‌ సుభానీ తెలిపారు. స్థానిక హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ సంఘం వర్తకులతో గురువారం చర్చించి తీర్మానం చేశారు. అధికారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్కెట్‌ పునఃప్రారంభానికి అనుమతులిచ్చినా ఇతర రాష్ట్రాలకు రైళ్లు, బస్సులు నడవక రవాణా స్తంభించడంతో వ్యాపారాలు జరగడం లేదన్నారు. అందుకే మార్కెట్‌ మూసివేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-06-05T11:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising