టెన్త్ పరీక్షలపై ప్రశ్నలెన్నో..?
ABN, First Publish Date - 2020-06-18T10:55:35+05:30
కరోనా వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. రాకపో కలపై నిషేధాలు విధించే రెడ్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన
తొమ్మిది రెడ్‌జోన్లలో పది పరీక్ష కేంద్రాలు
పాజిటివ్ కేసులు విజృంభిస్తే మరిన్ని జోన్లు
క్వారంటైన్లలోని పరీక్షార్థుల హాజరు ఎలా..
మొదలైన హాల్‌టిక్కెట్లు, ప్రశ్నాపత్రాల ముద్రణ
రెడ్‌జోన్లలోవున్న టెన్త్ పరీక్షార్థులు కంటైన్మెంట్ ఏరియాను దాటి బయటకు వచ్చి పరీక్షలకు హాజరు కావడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రెడ్‌జోన్ల నుంచి పరీక్షలకు హాజరయ్యేందుకు ఒకవేళ అనుమతిచ్చినా పరీక్ష కేంద్రాల్లో మిగతా విద్యార్థులు, నిర్వహణ సిబ్బంది నుంచి అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 17 : కరోనా వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. రాకపో కలపై నిషేధాలు విధించే రెడ్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో నిర్వహణపై ఆటంకాలు, అభ్యంతరాలు ఎదురయ్యే అవకా శాలు ఎక్కువవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది రెడ్‌జోన్లలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. పాజిటివ్ కేసు నిర్ధారణ అయిన ఎపీ సెంటర్ నుంచి 200 మీటర్ల పరిధికి లోబడి కంటైన్మెంట్ (రెడ్‌జోన్) ఏరియాగా గుర్తించి అక్కడి ప్రజ లు రెడ్‌జోన్‌ను దాటికి బయటికి రాకూడదు. ఇతరులు లోపలికి వెళ్లకూడదు. పరీక్షల నాటికి వీటి సంఖ్య ఆయా ప్రాంతాల్లో కొత్తగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలున్న విద్యార్థుల కోసం అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేకంగా ఒక్కొక్కటి చొప్పున ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేస్తున్నారు.
రెడ్‌జోన్లలో పరీక్ష కేంద్రాలు, కరోనా విజృంభణపై విద్యా శాఖ ఓ కన్ను వేస్తూనే పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల హాల్‌టిక్కెట్లు, ప్రశ్నాపత్రాల ముద్రణను ఇప్పటికే ప్రారంభించారు. విద్యార్థుల హాల్ టిక్కెట్లపై పరీక్ష కేంద్రాల చిరునామా వంటి వివరాలను ముద్రిస్తుండగా పరీక్షలు ప్రారంభం నాటికి ఆయా కేంద్రాలు రెడ్‌జోన్ల పరిధిలోకి వస్తే పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు ఎలా అన్న మీమాంస తలెత్తుతోంది. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 49,039 మంది, వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 988 మంది వెరసి మొత్తం 50,027 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తం 326 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. పాజిటివ్‌లకు నిర్ధారణ అయినా వ్యక్తులకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను, అనుమానిత లక్షణాలు ఉన్న వారిని పెద్దసంఖ్యలో క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇలా తరలించే వారిలో పది విద్యార్థులు ఉంటారన్న అంచనాలో విద్యాశాఖ వర్గాలు ఉన్నాయి.
వీరంతా పరీక్షలకు హాజరుకావడం ఒకింత అసాధ్యమేనని చెప్పవచ్చు. జిల్లాలో నాడు-నేడు కింద తొలివిడతలో ఎంపికైన పాఠశాలల్లో ప్రస్తుతం ఆయా పనుల నిమి త్తం తరగతుల్లో విద్యుదీకరణ, స్కూలు ప్రాంగణాల్లో టాయిలెట్ల నిర్మాణం, మేజర్, మైనర్ రిపేర్ల పనులు, తాగు నీటి వసతి పనులు జరుగుతున్నాయి. 326 పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉండగా, వీటిలోని 175 పాఠశాలల్లో నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాత నిర్మాణాలను కూల్చి, నూతన పనులు, మరమ్మతులు చేపట్టిన నేపథ్యంలో ఈ కేంద్రాల్లో పది పరీక్షలు సాఫీగా నిర్వహిం చడం ఒకింత కష్టసాధ్యమేనని భావిస్తున్నారు.
Updated Date - 2020-06-18T10:55:35+05:30 IST