ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ విడుదల

ABN, First Publish Date - 2020-10-01T18:05:08+05:30

ఉభయ గోదా వరి జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజక వర్గ ఓటర్ల జాబితాకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు పబ్లిక్‌ నోటీసుల జారీ


ఏలూరు(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదా వరి జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజక వర్గ ఓటర్ల జాబితాకు సంబంధించిన షెడ్యూల్‌ను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీనివాసమూర్తి విడుదల చేశారు. కలెక్టరేట్‌లో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆయన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అక్టోబరు 1న ఓటర్ల జాబితా కోసం పబ్లిక్‌ నోటీసు జారీ చేస్తామని ఆయన తెలిపారు. అక్టోబరు 15న పత్రికా ముఖంగా మొదటి రీ పబ్లికేషన్‌ నోటీసు, అక్టోబరు 25న రెండో రీపబ్లికేషన్‌ నోటీసు విడుదల చేస్తామన్నారు. నవంబరు 6న దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీగా నిర్ణయించామని తెలిపారు.


నవంబరు 25న మ్యాన్‌ స్ర్కిప్ట్‌ తయారు చేసి డిసెంబరు 1న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను ముద్రిస్తామని చెప్పారు. డిసెంబరు 1 నుంచి 31 వరకూ ఫిర్యాదులు, అభ్యర్థనలు తెలపవచ్చని, జనవరి 12న వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 188న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో వైసీపీ తరుపున బండారు కిరణ్‌, టీడీపీ తరుపున సహదేవ అచ్యు తరావు, కాంగ్రెస్‌ నేత రాజనాల రామ్మోహనరావు, సీపీఐ నేత డేగ ప్రభాకర్‌, సీపీఎం తరుపున డీఎన్‌వీడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T18:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising