ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ నేత సుబ్బయ్యది ప్రభుత్వ హత్య

ABN, First Publish Date - 2020-12-31T04:54:52+05:30

కడపలో బీసీ నేత నందం సుబ్బయ్య హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తోట సీతారామలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి

భీమవరం, డిసెంబరు 30 :  కడపలో బీసీ నేత నందం సుబ్బయ్య హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన బుధవారం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని టీడీ పీ నాయకుడు నందం సుబ్బయ్య బట్టబయలు చేసినందుకే అంతమెందించారని, ఈ హత్య ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. మెంటే పార్థసారథి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్‌ను నియమించాలని రాష్ట్ర నేతలను కోరుతున్నామన్నారు. వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ, వార్డు కమిటీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, స్థానిక ఎన్నికలపై చర్చించారు. మెరగాని నారాయణమ్మ, బర్రె నెహ్రు, యరకరాజు గోపాలకృష్ణంరాజు, కోళ్ళ నాగేశ్వరరావు, మామిడిశెట్టి ప్రసాదు, వేండ్ర శ్రీనివాస్‌, గునుపూడి తిరుపాల్‌, చెల్లబోయిన సుబ్బారావు, ఎండి అల్లావుద్దీన్‌ నౌషద్‌, మైలబత్తుల ఐజాక్‌బాబు, గంట త్రిమూర్తులు, ఉప్పులూరి చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. కరోనా నియం త్రణకు ప్రజలందరూ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుక నిర్వహించుకోవాలని కోరారు.

Updated Date - 2020-12-31T04:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising