ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హౌస్‌ అరెస్టు పిరికిపంద చర్య

ABN, First Publish Date - 2020-11-01T05:18:07+05:30

అమరావతి రైతుల అరెస్టులకు నిరసనగా గుంటూరు జైల్‌భరో కార్యక్రమానికి వెళ్ల నీయకుండా టీడీపీ నాయకులు ముంద స్తుగా హౌస్‌ అరెస్టు చేశారు.

హౌస్‌ అరెస్టుకి నిరసనగా గన్ని వీరాంజనేయులు ఇంటి వద్ద కార్యకర్తల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమడోలు/ తణుకురూరల్‌ /ఉండ్రాజవరం/ అక్టోబరు 31 : అమరావతి రైతుల అరెస్టులకు నిరసనగా గుంటూరు జైల్‌భరో కార్యక్రమానికి వెళ్ల నీయకుండా టీడీపీ నాయకులు ముంద స్తుగా హౌస్‌ అరెస్టు చేశారు.  ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి భీమడోలు సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది గన్ని వీరాంజనేయులును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం పోలీసు, ప్రభుత్వ చర్యలు ఖండిస్తూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ 320 రోజులుగా అమరావతి రైతులు  శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని నీర గార్చే ప్రయత్నమే వారిపై పెడుతున్న అక్రమ కేసులన్నారు. టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌లు పిరికిపంద చర్య అన్నారు.  వేల్పూరులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులను దొంగలు, హత్యలు చేసిన వారిలా బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్ళడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మానవహక్కులు పూర్తిగా హరించబడ్డాయన్నారు. జగన్‌ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును  శనివారం ఉదయం వేలివెన్నులో పోలీసులు హౌస్‌అరెస్ట్‌  చేశారు. 


గూడెంలో టీడీపీ నాయకుల ధర్నా 

తాడేపల్లిగూడెం రూరల్‌, : అమరావతి రైతులపై అక్ర మంగా పెట్టిన కేసులు ఎత్తి వేయాలని, అమరావతే ఏకైక రాజధా నిగా ఉంచాలని కోరుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఈలి నాని ఆధ్వ ర్యంలో పార్టీ నాయకులు శనివారం తహసీల్దార్‌ సాయిరాజ్‌కు వినతి పత్రం అందించారు.  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. మారిశెట్టి సుబ్బారావు, తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాధరాజు, మద్దిపాటి ధర్మేంద్ర, వీరాబత్తుల కల్కిమూర్తి, పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T05:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising