ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలి’

ABN, First Publish Date - 2020-12-06T05:40:35+05:30

పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారంగా మారనున్న ఇంటి పన్ను, నీటి చార్జీలు, డ్రెయినేజీ చార్జీల పెంపు జీవోలను వెంటనే రద్దు చేయాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, డిసెంబరు 5 : పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారంగా మారనున్న ఇంటి పన్ను, నీటి చార్జీలు, డ్రెయినేజీ చార్జీల పెంపు జీవోలను వెంటనే రద్దు చేయాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. తణుకు టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్‌ చట్టాల సవరణ పేరుతో ప్రభుత్వం మూడు జీవోలు తీసుకువచ్చి పట్టణ ప్రజలను మరింత దోపిడీ చేసేందుకు సిద్ధం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి విలువ ఆధారంగా కాదని, అద్దె విలువ ఆధారంగానే ఇంటి పన్నులను వసూలు చేయాలన్నారు. ఈ మూడు జీవోల అమలు జరిపితే ఒక్కో కుటుంబంపై రూ.2 వేల నుంచి రూ. 10 వేల వరకు పన్నుల రూపంలో భారం పడుతుందన్నారు. తక్షణమే జీవోలను రద్దు చేయాలని లేకపోతే ప్రజా ఉద్యమం నిర్వహిస్తామన్నారు. దొమ్మేటి వెంకట సుధాకర్‌, పరిమి వెంకన్నబాబు, బసవా రామకృష్ణ, తోట సూర్యనారాయణ, మంత్రిరావు వెంకటరత్నం, తాతపూడి మారుతీరావు, చింతలపూడి సన్యాసిరావు, తమరపు రమణమ్మ, తేతలి సాయి, ఎ.లాజర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising