ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరైనా.. ఢిల్లీ వెళ్లారా ?

ABN, First Publish Date - 2020-04-03T11:53:39+05:30

: ఏలూరు రూరల్‌ మండలంలోని తంగెళ్ళ మూడి, వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన వారికి కరోనా పాజిటివ్‌ నమోదవడంతో అధికారులు సర్వే ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాల్లో విస్తృత తనిఖీలు.. ఆరా తీస్తున్న అధికారులు


ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 2 : ఏలూరు రూరల్‌ మండలంలోని తంగెళ్ళ మూడి, వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన వారికి కరోనా పాజిటివ్‌ నమోదవడంతో  అధికారులు సర్వే ప్రారంభించారు. ఢిల్లీలో సదస్సుకు వెళ్ళి వచ్చిన వారిలో ఏలూరు తంగెళ్ళమూడికి చెందిన ఐదుగురు, వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు బయటపడింది. ఢిల్లీ వెళ్ళి వచ్చినవారు ఎక్కడెక్కడ పర్యటించారు..? వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారు అనే దానిపై అధికారులు, వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు.


ఎవరైనా ఢిల్లీ వెళ్ళి వస్తే స్వచ్ఛంధంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తంగెళ్ళ మూడి, వైఎస్‌ఆర్‌ కాలనీలో ప్రత్యేక పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గ్రామాలన్నింటిలోనూ వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ట్యాంకర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లిస్తున్నారు. డోర్‌టు డోర్‌ ఫైర్‌ ఇంజన్‌తో ఆరు ట్యాంకర్ల ద్వారా పిచికారీ చేయిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T11:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising