లాక్‌డౌన్ జరిమానా 1.27 కోట్లు : ఎస్పీ
ABN, First Publish Date - 2020-04-26T11:27:57+05:30
జిల్లాలో 10 పట్టణాలు, 24 మండలాల్లో రెడ్ జోన్ విధించినట్టు ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్/ యలమంచిలి/ ఉండి ,ఏప్రిల్ 25 :జిల్లాలో 10 పట్టణాలు, 24 మండలాల్లో రెడ్ జోన్ విధించినట్టు ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.తాడేపల్లిగూడెం పట్టణంలోని కడకట్ల, ముదునూరుపాడు రెడ్‌జోన్ ప్రాంతాల్లో శనివారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది పనితీరు పరిశీలించి పలు సూచనలు చేశారు.జిల్లాలో ఇప్పటి వరకూ రూ. 33.14 లక్షల సొమ్ము సీజ్ చేశామని, రూ.1.27 కోట్లు జరిమానా విధించామన్నారు.
సీఐ ఆకుల రఘు మాట్లా డుతూ రెడ్ జోన్‌లలో కట్టుదిట్టం చేశామన్నారు.లాక్‌డౌన్ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు సూచి ంచారు.చించినాడ వంతెన వద్ద చెక్‌పోస్టును పరిశీలించారు. రోడ్డుపై ఏ పని లేకుండా తిరుగుతున్న కొంతమందిని ఆపి కౌన్సిలింగ్ నిర్వహించారు. పాలకొల్లు రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ కె.గంగాధర్‌కు సూచనలు చేశారు.అనవసరంగా ఎవరు బయటకు రావద్దని ఉండి ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు.
Updated Date - 2020-04-26T11:27:57+05:30 IST