ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో లాక్‌డౌన్‌ అతిక్రమించిన కేసులు 10,056

ABN, First Publish Date - 2020-04-05T11:00:17+05:30

జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఇప్పటి వరకు మొత్తం 10,056 కేసులు నమోదు చేశామని శనివారం అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌


ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 4 :  జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఇప్పటి వరకు మొత్తం 10,056 కేసులు నమోదు చేశామని శనివారం అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తెలిపారు. ఇందులో 624 క్రిమినల్‌ కేసులున్నాయన్నారు. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమలులో ఉందని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన 2,883 మంది నిందితులను అరెస్ట్‌   చేసి వారి నుంచి 857 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.


మోటారు వాహన చట్టం         కింద 9,432 కేసులు నమోదు చేసి 44 లక్షల 4 వేల రూపాయల అపరాధ రుసుం విధించామన్నారు.  ఇతర కేసులలో రూ. 8,63,243 స్వాధీనం చేసుకున్నామ న్నారు. కొంతమంది కోడి పందేలు ఆడుతుండగా 30 కోడి పుంజులు, 34 కోడి కత్తులు, 353 మద్యం బాటిల్స్‌, 184 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నా మన్నారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపే ఇంటికి ఒకరు చొప్పునే బయటికి వచ్చి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుని వెళ్లిపోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-04-05T11:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising