సోమేశ్వరాలయంలో కార్తీక ఏర్పాట్లు
ABN, First Publish Date - 2020-11-14T04:55:12+05:30
కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభం కానుండడంతో పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పంచారామంలో సామూహిక పూజలకు అనుమతి లేదు
భీమవరం టౌన్, నవంబరు 13 : కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభం కానుండడంతో పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు స్వామివ ారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్‌లను ఏర్పాటుచేస్తున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఆలయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక పూజలు కూర్చుని చేయించుకోడానికి భక్తులను అనుమతి లేదని ఆలయ ఇవో ఆరుణ్‌కుమార్ తెలిపారు. ఆలయంలో స్వయంగా అభిషేకాలు చేసుకునే బ్రాహ్మణులను గర్భాలయంలోకి కూడా అనుమతించబడదని, పురోహితుల ద్వారా భక్తులు అభిషేకాలు చేయించుకోవచ్చన్నారు. పరోక్ష పద్దతిలో గోత్రనామాలతో చేయించుకోవాలని సూచించారు. దీపారాధనలు, సాలగ్రామదానాలు కూడా ఆలయంలో అనుమతించబడవని తెలిపారు. భక్తులు గమనించి అధికారులకుసహకరించాలని కోరారు.
Updated Date - 2020-11-14T04:55:12+05:30 IST