ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణ ప్రతిపాదనలు పంపండి

ABN, First Publish Date - 2020-03-31T10:53:41+05:30

పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కరోనా మహమ్మారి ప్రభావంతో వాయిదా పడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటిలోగా ఇవ్వాలంటూ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు

ప్రతిపాదనలు పంపకుంటే భూమి ఉన్నట్టే లెక్క

ఆ తర్వాత పరిణామాలకు అధికారులదే బాధ్యత

రెవెన్యూ సిబ్బందికి స్పష్టం చేసిన ఉన్నతాధికారులు 

ఉత్తర్వులు జారీతో సిబ్బంది బెంబేలు


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కరోనా మహమ్మారి ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.. గతంలో ఇళ్ల స్థలాలు, ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న అధికారులు ఇప్పుడు కరోనా కట్టడి కోసం పోరాడాల్సి వస్తోంది. మరో వైపు రేషన్‌ పంపిణీ, వలస కార్మికుల గుర్తింపు వంటి విధులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలోనే మరో ఆదేశం పిడుగులా వచ్చి పడింది. ఇళ్ల స్థలాలు పంపిణీ కోసం భూసేకరణ ప్రతిపాదనలు మంగళవారం లోపు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలా పంపకపోతే సంబంధిత మండల పరిధిలో భూమి అందు బాటులో ఉన్నట్టే పరిగణిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


తర్వాత పరిణా మాలకు సంబంధిత మండల రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఒకింత హెచ్చరిక ఆ ఉత్తర్వుల్లో చేర్చారు. అదే ఇప్పుడు రెవెన్యూ సిబ్బందిని ఊపిరి సల్పనీయడం లేదు. ప్రస్తుతం రేషన్‌ పంపిణీలో బిజీగా ఉన్నారు. కరోనా విధుల్లో బిజీగా ఉండటంతో రెగ్యులర్‌ విధులను సిబ్బంది పక్కన పెట్టారు. ఇటువంటి తరుణంలో మంగళవారం లోగా భూసేకరణ ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు రావడంతో రెవెన్యూ సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగినట్టే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి గుర్తింపులో మల్లగుల్లాలు పడ్డారు. కొన్ని చోట్ల భూమిని ముందుగానే గుర్తించారు. వాటి ధరలను అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది. ఒక్క రోజు వ్యవధిలో ఆ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలంటూ సిబ్బంది కంగారు పడుతున్నారు. జిల్లాలో సుమారు 2.60 లక్షల మందికి పట్టాలివ్వాలని నిర్ణయించారు.


అందులో 1.86 లక్షల మందికి ప్రభుత్వ స్థలాలు ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి లేఅవుట్‌లు సిద్ధం చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పుడు ఉన్నట్టుండి భూసేకరణ ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలివ్వడంతో ఏం చేయాలో తెలియక రెవెన్యూ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అంతా కరోనా మహమ్మారి విధుల్లో అల్లాడి పోతున్న తరుణంలో భూసేకరణ ప్రతిపాదనలు ఎలా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2020-03-31T10:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising