ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిలో రూ.50 ఉల్లి

ABN, First Publish Date - 2020-09-24T11:06:16+05:30

ఉల్లి ధరలు మరింత ఘాటె క్కాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20 నుంచి రూ.30 వరకు దొరికితే.. ఇప్పుడు 50 రూపాయలకు చేరింది. మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘాటెక్కిన ఉల్లి ధరలు

వినియోగదారుల గగ్గోలు


ఏలూరు సిటీ, సెప్టెంబరు 23 : ఉల్లి ధరలు మరింత ఘాటె క్కాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20 నుంచి రూ.30 వరకు దొరికితే.. ఇప్పుడు 50 రూపాయలకు చేరింది. మరికొద్ది రోజుల్లో రూ.60కు చేరవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యత లేని తక్కువ రకం రూ.35కు విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో రూ.28 నుంచి రూ.38 వరకు పలుకుతోంది. తాడేపల్లిగూడెంలో హోల్‌సేల్‌ మార్కెట్‌కు మహారాష్ట్రతోపాటు కర్నూలు నుంచి దిగుమతి అవు తుంది.


ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఆయా ప్రాంతాల్లో పంట పూర్తిగా దెబ్బతినడంతో దిగుమతులు తగ్గా యని చెబుతున్నారు. గత ఏడాది భారీ వర్షాలకు పంట తుడిచి పెట్టుకుపోవడంతో ఆ సమయంలో తీవ్ర కొరత ఏర్పడింది. అప్ప ట్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు అమ్మకాలు సాగాయి. ఈసారి గత ఏడాదికన్నా ఉల్లి కొరత ఎక్కువ కావచ్చునని కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసింది.


అయినా దేశీయ అవస రాలకు సరిపడా ఉల్లి ఉత్పత్తి లేకపోవటంతో ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబరులోను భారీగా వర్షాలు కురిస్తే గత ఏడాదికి మించిన ధరలు ఉంటాయని అం టున్నారు. ఇప్పటికే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా యి. కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల్లోకన్నా లాక్‌డౌన్‌ సమయంలో వినియోగం బాగా తగ్గింది. దీనికి కారణం హోటళ్ళు, హాస్టళ్ళు, బజ్జీ బళ్లు లేకపోవడమే. కేవలం గృహావసరాలకే విని యోగం ఉండటంతో వినియోగం తగ్గింది.


ప్రస్తుతం అన్‌లాక్‌ నడుస్తుండటంతో హోటళ్లు తెరుచుకుంటున్నాయి. కొన్ని రోజులలో హాస్టల్స్‌ తెరుస్తారు. దీంతో మళ్లీ ఉల్లి వినియోగం పెరిగే అవకా శాలున్నాయి. ఉల్లి ధరలను నియంత్రించడంపై పాలకులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం సబ్సిడీపై కిలో రూ.25కు పంపిణీ చేశారు. ఇప్పుడు ఇదే మాదిరి తక్కువ ధరకు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-24T11:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising