ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌ టవర్‌ ఎక్కిన రోహిత్‌పై రౌడీషీట్‌

ABN, First Publish Date - 2020-11-30T04:54:44+05:30

సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించిన మల్లి రోహిత్‌పై రౌడీషీట్‌ తెరవను న్నట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జి.రవికిరణ్‌ తెలిపారు.

వివరాలు తెలుపుతున్న డీఎస్పీ రవికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం టౌన్‌, నవం బరు 29 : సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించిన మల్లి రోహిత్‌పై రౌడీషీట్‌ తెరవను న్నట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జి.రవికిరణ్‌ తెలిపారు. ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత నెల 5వ తేదీన జంగారెడ్డిగూడెం ఆర్‌టీవో కార్యాలయం వద్ద యువతిని వేధిస్తున్నాడని పోలీ సులకు సమాచారం అందడంతో జంగారెడ్డిగూడెం పోలీస్‌ కాని స్టేబుల్‌ రాంబాబు అక్కడకి వెళ్లాడన్నారు. అయితే అక్కడున్న రోహిత్‌ కానిస్టేబుల్‌ రాంబాబును బలంగా కొట్టి పారిపోయాడన్నారు. అనంతరం కానిస్టేబుల్‌, యువతి ఇచ్చిన ఫిర్యా దుపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. కేసులు నమోదైన అనంతరం 6వ తేదీ సాయంత్రం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో గల ఓ సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, 7వ తేదీ ఉదయం వరకు సెల్‌ టవర్‌పైనే ఉన్నాడన్నారు. తేనెటీగలు దాడిచేయడంతో దిగి వచ్చిన రోహిత్‌ను పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే వైద్యం పొందుతూ రోహిత్‌ పారిపోయినట్లు తెలిపారు. రోహిత్‌ను పట్టుకోవడం కోసం జిల్లా ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని, ఎస్సై ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో రోహిత్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. రోహిత్‌పై గతంలో ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన సంఘ టనలో రెండు కేసులు, పోలీస్‌ విధులను అడ్డగించినందుకు మరో కేసు ఉన్నాయ న్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన ఆనంద్‌రెడ్డి, ఏఎస్సై సంపత్‌ కుమార్‌, కాని స్టేబుల్‌ శ్రీను, రాములను డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2020-11-30T04:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising