ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడుపై విద్యాశాఖ కమిషనర్‌ సమీక్ష

ABN, First Publish Date - 2020-02-20T06:44:12+05:30

నాడు-నేడు కార్యక్రమానికి రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పెదపాడు మండలంలో తొలివిడతగా 23

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 19 : నాడు-నేడు కార్యక్రమానికి రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పెదపాడు మండలంలో తొలివిడతగా 23 ప్రభుత్వ పాఠశాలల్లో గుర్తించిన పనుల అమలులో విద్యాధికారులు చేసిన కృషిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ బి.రాజశేఖర్‌, ప్రభుత్వ సలహా దారు ఆకునూరి మురళి అభినందించారు. ఆయన బుధవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో నాడు-నేడు పనుల ప్రగతిని జిల్లా విద్యాధికారులతో సమీక్షించారు.


పాఠశా లల అభివృద్థికి గుర్తించిన పనులను చేపట్టడంలో కాంట్రాక్టర్ల ప్రమేయం ఉండరాదని స్పష్టం చేశారు. పెయింట్లు, తాగునీటి శుద్ధి యంత్రాలు, ఫ్యాన్లు, డ్యూయల్‌ డెస్క్‌లను మాత్రం రాష్ట్రస్థాయిలో టెండర్లు ఖరారు చేసి ఎంపిక చేసిన తయారీ సంస్థల ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తామన్నారు. పేరెంట్స్‌ కమిటీలో ఒకరు బాధ్యత తీసుకుని, ఆయా సామగ్రి కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాకు మూడు విడతల్లో కేటా యించిన రూ.222 కోట్లలో తొలివిడత పనులకు రూ.2.53 కోట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఈ నిధులను హెచ్‌ఎంల లాగిన్‌లకు జమ చేశామని, జూన్‌ 10వ తేదీ నాటి కల్లా నిర్దేశిత పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. సమీక్షలో డీఈవో సీ.వీ.రేణుక డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T06:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising