ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడువు పొడిగించినా అందని రేషన్‌

ABN, First Publish Date - 2020-11-30T05:08:15+05:30

కరోనా కింద తుది విడత రేషన్‌ సరుకుల పంపిణీ ప్రహసనంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ– పోస్‌ సర్వర్‌ మొరాయింపే కారణం

మండలంలో 69.90 శాతం పంపిణీ

ఏలూరు రూరల్‌, నవంబరు 29: కరోనా కింద తుది విడత రేషన్‌ సరుకుల పంపిణీ ప్రహసనంగా జరిగింది. పంపిణీ ప్రా రంభమైన రోజు నుంచి నిత్యం సర్వర్‌ మొరాయించడం, ఒక్కో కార్డుదారుని రేషన్‌ పంపిణీ చేయడానికి ఎక్కువ సమయం పట్టడంతో చాలామంది సరుకులు తీసుకోలేకపోయారు. ఈనెల 27తో గడువు ముగిసినా ప్రభుత్వం మరో మూడు రోజులపాటు పొడిగించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మొత్తం 69.90 శాతం మాత్రమే రేషన్‌ సరుకులు తీసుకోగలి గారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వర్‌ సతాయించింది. దీంతో రేషన్‌కోసం కార్డుదారులు, డీలర్లు అసహనం వ్యక్తం చేశారు.  ఏలూరు మండలంలో 80 రేషన్‌దుకాణాలకు 81,145 కుటుంబాలు ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభ మైనప్పటి నుంచి వీరికి నెలలో రెండుసార్లు రేషన్‌సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఒక్క పంచదార కు మాత్రమే నగదు తీసుకుంటున్నారు. కాగా ప్రతి విడతలో  70 నుంచి 80 శాతం మంది కార్డుదారులు రేషన్‌ సరుకులు పొందుతున్నారు. గత నెల నుంచి ప్రభుత్వం రెండుసార్లు వేలి ముద్రలు వేసే విధానాన్ని అమలులోకి తీసు కొచ్చింది. దీంతో సర్వర్‌ తరచు మొరాయించడం ప్రారం భించింది. షాపుల వద్ద పడిగాపులు కా యాల్సి వచ్చింది.  ఆదివారం మధ్యా హ్నం రెండు గంటల వరకూ కూడా సర్వర్‌ పని చేస్తుందని వేచి ఉన్నా సర్వర్‌ పనిచేయకపోవడంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటి ముఖం పట్టారు.

Updated Date - 2020-11-30T05:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising