ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యమే ఇచ్చారు..?

ABN, First Publish Date - 2020-11-04T05:05:40+05:30

ఈ సారి ఉచిత రేషన్‌లో సరుకుల కొరత ఏర్పడింది. డిపోలకు బియ్యం మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన శన గలు,పంచదార సరఫరా కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేషన్‌కు సరుకుల కొరత

కొన్ని డిపోలకు అందని శనగలు, పంచదార

తొలి రోజు తప్పని సర్వర్‌ కష్టాలు

ఏలూరుసిటీ/ నల్లజర్ల, నవంబరు 3 : ఈ సారి ఉచిత రేషన్‌లో సరుకుల కొరత ఏర్పడింది. డిపోలకు బియ్యం మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన శన గలు,పంచదార సరఫరా కాలేదు. దీంతో డీలర్లు, కార్డుదారులు ఇబ్బందిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2200 చౌకడిపోల్లో 15వ విడత ఉచిత రేషన్‌ పంపిణీ  మంగళవారం ప్రారంభించారు. చాలా చౌకడిపోల్లో మధ్యాహ్నం వరకు ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం కాలేదు.  నిత్యావసర సరుకులు పంపిణీకి సర్వర్‌ ఓపెన్‌ కాలేదు. దీంతో ఈ సారి సర్వర్‌ కష్టాలు తప్పలేదు. దీనికి తోడు కొన్ని చౌక డిపోలకు సరుకుల కొరత ఏర్పడింది. తాడేపల్గిగూడెం కేంద్రంగా నల్లజర్ల, తాడేపల్లిగూడెం, గణపవరం, పెంటపాడు మండలాలకు రేషన్‌ సరుకులు సరఫరా చేస్తారు. స్టాక్‌ పాయింట్‌ నుంచి రెండు విడతలుగా సరుకులు సక్రమంగా రేషన్‌ డిపోలకు చేరక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. 15వ విడత రేషన్‌కు సంబంధించిన మంగళవారం నుంచి బియ్యం,కందిపప్పు,పంచదార అందించాల్సి ఉండగా ప్రస్తుతం బియ్యం మాత్రమే రేషన్‌ డిపోలకు చేరాయి.దీంతో కేవలం బియ్యం మాత్రమే ప్రజలకు అందిస్తున్నారు.శనగలు,కందిపప్పు,పంచదార మండల స్టాక్‌ పాయింట్లకు చేరలేదని అధికారులు చెబుతున్నారు. 14వ విడత రేషన్‌ పంపిణీలో శనగల కొరత రావడంతో ప్రజలు రెండు సార్లు డిపోలకు వద్దకు రావాల్సి వచ్చింది. ఈ సారి కూడా రెండు వేలిముద్రలు వేయాల్సి రావడంతో రేషన్‌ కార్డుదారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. దీంతో తొలిరోజుతొలిరోజు కేవలం 4.58 కార్డులకు మాత్రమే రేషన్‌ పంపిణీ చేశారు. జిల్లాలో ఈ సారి 12,93,075 కార్డులకు రేషన్‌ పంపిణీ చేయాల్సి ఉండగా 59,224 కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేశారు. 

Updated Date - 2020-11-04T05:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising