ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయ వ్యవస్థపై పాలకపక్షం దాడి దారుణం

ABN, First Publish Date - 2020-10-17T11:26:01+05:30

న్యాయ వ్యవస్థపైన పాలకులు ఫిర్యాదులతో దాడికి పాల్పడడం దారుణమని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్‌ (ఐఏయల్‌) రాష్ట్ర కార్యదర్శి చెల్లబోయిన రంగారావు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరంలో న్యాయవాదుల నిరసన


భీమవరం, అక్టోబరు 16 : న్యాయ వ్యవస్థపైన పాలకులు ఫిర్యాదులతో దాడికి పాల్పడడం దారుణమని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్‌ (ఐఏయల్‌) రాష్ట్ర కార్యదర్శి చెల్లబోయిన రంగారావు ధ్వజమెత్తారు. ఐఏఎల్‌ పట్టణ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అధికార పార్టీ వైఖరిని విమర్శించారు. న్యాయమూర్తులపైనే ఫిర్యాదు చేసే వైఖరి సముచితం కాదన్నారు. న్యాయవాదులుగా ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీ బార్‌ కౌన్సిల్‌ దీనిపై సీరియస్‌గా వ్యవహరించాలని రంగారావు డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు పులిచర్ల సునీల్‌కుమార్‌, అద్దంకి రాజేషు, శివప్రసాద్‌గౌడ్‌, రాము, మణికంఠ, వంశీ, స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T11:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising