జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంపు
ABN, First Publish Date - 2020-05-09T08:15:42+05:30
జిల్లా సరిహద్దుల్లో రెండు రోజుల నుంచి భద్రతను పెంచారు. నిబంధనలు అతిక్రమించి వాహనాల్లో
ఏలూరు క్రైం/నరసాపురం, మే 8 : జిల్లా సరిహద్దుల్లో రెండు రోజుల నుంచి భద్రతను పెంచారు. నిబంధనలు అతిక్రమించి వాహనాల్లో సరిహద్దు దాటడానికి ప్రయత్నిం చిన పలువురిని పోలీస్ యంత్రాంగం అడ్డుకుంది. కృష్ణా జిల్లా నుంచి ఆకివీడు మీదుగా, తూర్పు గోదావరి నుంచి చించినాడ మీదుగా జిల్లాలోకి వస్తున్నారు. దీనిని గుర్తించిన పోలీసులు సరిహద్దుల వద్ద బందోబస్తును పెంచారు. కృష్ణాకు సరిహద్దునవున్న లోసరి, కాళీపట్నం, చించినాడ, దుంపగడప వద్ద ప్రస్తుతం వున్న చెక్‌పోస్టులను తరచూ అధికారులు చెక్ చేస్తున్నారు. అనుమతి పత్రాలు ఉంటేనే వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే లోనికి అనుమతి ఇస్తున్నారు. గుట్టుగా తెలంగాణ నుంచి శుక్రవారం నరసాపురం వచ్చిన ఏడు గురిని అధికారులు భీమవరం క్వారంటైన్‌కు తరలించారు.
అత్యవసర వైద్యం, ఎవరైనా మరణిస్తే వెళ్లడానికి మాత్ర మే జిల్లా ఎస్పీల సెల్ నెంబర్‌కు వాట్సప్‌లో వినతిపత్రం ఇస్తే అదే వాట్సప్‌కు అనుమతి పత్రాన్ని ఇస్తున్నారు. కృష్ణా నుంచి పశ్చిమ గోదావరి సరిహద్దు అయిన కలపర్రు టోల్‌గేటు వద్ద ఎస్పీ నవదీప్‌సింగ్ ఆదే శాల మేరకు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్ పర్యవేక్షణలో రూరల్ సీఐ ఎ.శ్రీనివాస రావు, పెదపాడు ఎస్‌ఐ జ్యోతిబస్ వారి సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతి లేకుండా వచ్చిన వాహనదారులను నిలిపి వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
Updated Date - 2020-05-09T08:15:42+05:30 IST