ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ప్రైవేటీకరణ వద్దంటూ నిరసనలు

ABN, First Publish Date - 2020-07-18T11:39:54+05:30

కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రై వేటీకరించాలని నిర్ణయిం చ డం పట్ల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సీఐటీయూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌/ పా లకొల్లు అర్బన్‌/ ఆకివీడు/ త ణుకు/ నరసాపురం టౌన్‌, ఉండి/నిడదవోలు/ భీమడో లు/ కొవ్వూరు, జూలై 17 : కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రై వేటీకరించాలని నిర్ణయిం చ డం పట్ల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు  తెలిపా రు. ప్రైవేటీకరణ యోచనను బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్‌ వద్ద సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాల ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ప్రజా భిప్రాయం లేకుండా రైల్వేలను ప్రైవేటీకరించ వద్దని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. పాలకొల్లు రైల్వే గేటువద్ద  సీఐటీయూ పట్టణ కార్యదర్శి జవ్వాది శ్రీని వాసరావు ఆధ్వర్యంలో  నిరసన  చేపట్టారు.


ఆకివీడు రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై సీఐటీయూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు ఆధ్వర్యంలో, శాంతినగర్‌లో డీవై ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తణుకు రైల్వే స్టేషన్‌ వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్‌ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు.  రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని మానుకోవాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నరసాపురం  రైల్వేస్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఉండి రైల్వే గేటు, చెరుకువాడ రైల్వేస్టేషన్లు వద్ద సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. నిడదవోలు రైల్వేస్టేషన్‌ వద్ద సీఐటీయూ, కేవీపీఎస్‌ రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ధర్నా చేపట్టారు.


జువ్వల రాంబాబు, గంటి కృష్ణ, ఎస్‌.ఆంజనేయు లు, సుభాని, దిద్దే క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు. భీమడోలు, పూళ్ళ రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో సీఐటీయూ అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగరాజు తదితరులు పాల్గొన్నారు.     కొవ్వూరులో రైల్వే ప్రవేటీకరణ చేయొద్దని సీఐటీయూ పట్టణ కార్యదర్శి ఎంఎం సుందరబాబు డిమాండ్‌ చేశారు. స్థానిక అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద కేంద్రం తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన తెలిపారు.  

Updated Date - 2020-07-18T11:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising