ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులకు పదోన్నతి కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2020-02-20T06:45:08+05:30

ఉపాధ్యా యులకు పదోన్నతి కౌన్సెలింగ్‌ను బుధవారం ఏలూరు డీఈవో కార్యాలయంలో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 19 : ఉపాధ్యా యులకు పదోన్నతి కౌన్సెలింగ్‌ను బుధవారం ఏలూరు డీఈవో కార్యాలయంలో నిర్వహించారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయ ఖాళీలు మొత్తం 62 ఉండగా, వీటిలో 49 ఖాళీలను టీచర్ల సీనియార్టీ, అర్హతల ప్రాతిపదికన భర్తీ చేశారు. మరో 13 ఖాళీలు టీచర్ల అన్‌విల్లింగ్‌, అభ్యర్థులు లేని కార ణంగా మిగిలిపోయాయి.


వీటిని వచ్చే కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎం ఖాళీలు 21 ఉండగా 18 భర్తీ అయ్యాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం నాలుగు ఖాళీలకు మూడు, ఫిజికల్‌ సైన్సు 3 పోస్టులు ఉండగా భర్తీ కాలేదు. బయోలాజికల్‌ సైన్సు ఎనిమిది ఉండగా ఆరు, సోషల్‌ స్టడీస్‌ ఏడు ఉండగా ఆరు, ఇంగ్లీషు 2, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 17 ఉండగా 14 ఖాళీలు భర్తీ అయ్యాయి. కౌన్సెలింగ్‌ ప్రారంభానికి ముందుగా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈవో సమావేశం నిర్వ హించి, విధివిధానాలను వివరించారు. పదోన్నతి పొందిన టీచర్లకు ఆయా స్థానాల్లో బదిలీపై నియ మించేందుకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

కౌన్సెలింగ్‌ నిర్వహణలో అసిస్టెంట్‌ డైరెక్టర్లు టీఎస్‌ బాబు, వెంకటరమణ, సూపరిం టెండెంట్‌ కుమార్‌,  ఉపాధ్యాయ సంఘాల నాయకులు జయకర్‌, గోపి మూర్తి, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, సాయి శ్రీని వాస్‌, సాల్మన్‌రాజు, సుధీర్‌, స్టీవెన్‌ సహకరించారు.

Updated Date - 2020-02-20T06:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising