ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎంఐలకు విరామం

ABN, First Publish Date - 2020-04-01T10:45:07+05:30

కరోనా వైరస్‌.. 21 రోజుల లాక్‌ డౌన్‌ నేపథ్యంలో బ్యాంకు రుణాలపై మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేస్తూ ఆర్‌బీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు లక్షల మందికిపైగా ఉపశమనం

వాయిదాలు కావాల్సిన వారు ముందుగా బ్యాంకులకు దరఖాస్తు చేయాలి

చిన్న తరహా పరిశ్రమలపై స్పష్టత ఇవ్వని ఆర్‌బీఐ.. ఆదుకోకుంటే కుదేలే


పాలకొల్లు, మార్చి 31 : కరోనా వైరస్‌.. 21 రోజుల లాక్‌ డౌన్‌ నేపథ్యంలో బ్యాంకు రుణాలపై మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంపై జిల్లాలో లక్షలాది మందికి ఉపశమనం కలగ నుంది. గృహ, వాహన, విద్యా రుణాలు పొందిన వారు మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో చెల్లించాల్సిన వాయిదాలు ఆయా నెలల్లో చెల్లించనక్కర్లేదు. జూన్‌ నుంచి కట్టుకో వచ్చు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా గృహ రుణాల కింద 42,605 మంది రూ.4,169.78 కోట్లు తీసుకున్నారు. విద్యా రుణాల కింద 9,446 మంది రూ.461.38 కోట్లు లబ్ధి పొందారు. వాహన, ఇతర రుణాల కింద రెండు లక్ష ల పది వేల ఎనిమిది మంది రూ.6,189.14 కోట్లు పొం దారు. వ్యవసాయం, బంగారం రుణాలు మినహా మొత్తం గా ఈ రుణాలు సుమారు రూ.11 వేల నాలుగు వందల కోట్ల వరకు ఉన్నాయి.


ఇప్పుడు వీరందరూ చెల్లించాల్సిన వాయిదాలను మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో రుణాలు పొందిన వీరందరికీ వెసులుబాటు వర్తిస్తుంది. ఈఎంఐలు చెల్లించే స్తోమత వున్న రుణ గ్రహీతలు ఎప్పటిలాగే చెల్లించుకోవచ్చని బ్యాంకులు సూచిస్తున్నా యి. ఈ మూడు నెలల మినహాయింపు కోరే వారు కరో నా లాక్‌డౌన్‌ కారణంగా తమ ఆర్థిక పరిస్థితి మందగిం చిందంటూ వివరణతో దరఖాస్తు చేసుకోవాలి. 


గృహ, వాహన, విద్యా రుణాల ఈఎంఐలపై స్పష్టత ఇచ్చినప్పటికీ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజె స్‌(ఎంఎస్‌ఎంఈ) రుణాల విషయంలో సందిగ్ధత ఏర్ప డింది. దీని కింద లక్షా 14 వేల 768 మంది రూ.3,599.97 కోట్లు తీసుకున్నారు. వీరి విషయంలో ఆర్‌బీఐ స్పష్టత ఇవ్వకపోవడంతో ఉత్పాదక రంగంపై ఈ ప్రభావం పడుతుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో పారిశ్రామికం రంగం కుదేలైంది. వారాల తరబడి పరిశ్రమలు మూతపడడం ద్వారా ఉత్పత్తి ఆగడం, అదే సమయంలో కార్మిక, ఉద్యోగ వర్గాలకు వేతనాలు చెల్లించాల్సి రావడం, సాధారణ మెయింటినెన్స్‌ ఖర్చులు యధావిధిగా ఉండడం వంటి కారణాలతో పదుల సంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్ర మలు మూతపడే ప్రమాదమూ ఉంది. వాయిదాలను వాయిదా వేస్తూ మారటోరియం ప్రకటిస్తే సరిపోదు. తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేయడం, ఓడీ(ఓవర్‌ డ్రాఫ్ట్‌) వంటి ఖాతాలలో రుణ పరిమితి పెంచడం, స్వల్పకాలిక రుణాలను తక్కువ వడ్డీకి అందజేయడం వంటి చర్యలతో పారిశ్రామిక, ఉత్పాదక రంగాలు కుదుట పడతాయని ఓ పారిశ్రామికవేత్త సూచించారు.


Updated Date - 2020-04-01T10:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising