ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంట నూనెల మంట.. లీటర్‌కు రూ.20కి పైగా పెరుగుదల

ABN, First Publish Date - 2020-09-21T14:58:10+05:30

నిత్యావసర సరు కుల ధరలు కరోనా, లాక్‌డౌన్‌ కష్టాల నుంచి ఇంకా కోలుకోని ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటి వరకూ కాయగూరల ధరలు మోత మోగిస్తే మూడు రోజులుగా వంట నూనెల మంట మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామాయిల్‌ రూ.95, సన్‌ఫ్లవర్‌ రూ.125, వేరుశనగ రూ.180

ఉల్లిదీ అదే దారి.. కిలో రూ.40


ఏలూరు (ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరు కుల ధరలు కరోనా, లాక్‌డౌన్‌ కష్టాల నుంచి ఇంకా కోలుకోని ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటి వరకూ కాయగూరల ధరలు మోత మోగిస్తే మూడు రోజులుగా వంట నూనెల మంట మొదలైంది. మూడు రోజుల వ్యవధిలో ఊహించని రీతిలో వంట నూనెల ధరలు కిలోకి 20 నుంచి 35 రూపా యల వరకూ పెరిగింది. సామాన్యులకు చౌకగా లభించే పామా యిల్‌కు రెక్కలొచ్చాయి. మూడు రోజుల క్రితం వరకూ లీటర్‌ రూ.70 ఉన్న పామాయిల్‌ ఇప్పుడు రూ.95 అమ్ముతు న్నారు. సన్‌ఫ్లవర్‌ రూ.108 నుంచి రూ.125కి, వేరుశనగ నూనె రూ.135 నుంచి రూ.180లకు పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు పామాయిల్‌ లీటరు రూ.65 ఉండేది. సన్‌ఫ్లవర్‌ రూ.90, వేరుశనగ రూ.135 ఉండేది. ఈ ఆరు నెలల కాలంలో అన్ని రకాల వంట నూనెల ధరలు 30 నుంచి 45 రూపాయలు పెరిగాయి. ఉల్లిపాయల ధరలు లాక్‌డౌన్‌ అనంతరం భారీగా పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో కిలో రూ.20లోపు వున్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.40 వరకు అమ్ముతున్నారు. వీటితో పాటు కూరగాయలు, నిత్యావసరాల ధరలు సగటున 20 శాతం పెరిగాయి. ఫలితంగా ఒక్కో కుటుంబంపై నెలకు రూ.2000 వరకూ అదనపు భారం పెరిగింది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


సరఫరా లోపమే వ్యాపారులకు వరమా ?

ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ దేశాల్లో పామా యిల్‌ ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గింది. ఈ దేశాల నుంచే మనం ఎక్కువగా ఆయిల్‌ దిగుమతులు చేసుకుంటాం. దేశీ యంగా ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో పామాయిల్‌ దిగుమతులు బారీగా తగ్గాయి. నిత్యావసర సరుకులతోపాటు వంట నూనెలకు కావాల్సిన సన్‌ ఫ్లవర్‌, వేరుశనగ గింజల ధరలు పెరిగాయి. ఈ కార ణంగా నూనె ధరలు పెరిగాయని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాల సరఫరా అవసరానికి తగినస్థాయిలో లేదని, ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గిపోయాయని  ఇది ఆసరా చేసుకుని సరఫరాదారులు, డీలర్లే ధరలను పెంచే స్తున్నారని రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ సడ లించిన తరువాత అప్పటికంటే రెట్టింపు స్థాయిలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-09-21T14:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising