ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాల్లేవ్‌

ABN, First Publish Date - 2020-10-20T06:27:10+05:30

కొవిడ్‌ బాధితులకు సేవలందించేందుకు వారు ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వచ్చారు. అలాంటి వారికి ఐదు నెలలుగా జీతా లు నిలుపుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ కాంట్రాక్టు వైద్య సిబ్బంది ఇక్కట్లు


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, అక్టోబరు 19 : కొవిడ్‌ బాధితులకు సేవలందించేందుకు వారు ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వచ్చారు. అలాంటి వారికి ఐదు నెలలుగా జీతా లు నిలుపుదల చేయడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మే నెలలో ఎమర్జెన్సీ ప్రాతి పదికన ఆశ్రం కొవిడ్‌ ఆసుపత్రిలో 50 మంది నర్సులు, 60 మంది ఇతర సిబ్బంది, 15 మంది ఎనస్తీషియన్లు, 15 మంది ల్యాబ్‌ టెక్నీ షియన్లు ఉన్నారు. ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందిస్తుంటే వేతనాలు ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అప్పులు చేసి కుటుం బాన్ని పోషించుకుంటున్నామని జీతాలు ఇప్పించాలని మొరపెట్టుకుంటున్నారు. ప్రతిరోజు వివిధ ప్రదేశాల నుంచి బస్సులు లేకపోవడంతో కిరాయికి ఆటోలు మాట్లాడుకుని డ్యూటీలకు వస్తున్నామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెం ట్‌కు ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపో యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


‘కొవిడ్‌ పేషెంట్లకు వైద్యమందించేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన జీవో నెంబర్‌ 77 ద్వారా వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టింది. కొత్త నియామకం వల్ల ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వీరి జీతాల కోసం నిధులు విడుదల కాలేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలో బకాయిలతో సహా చెల్లిస్తాం’ అని కొవిడ్‌ ఆశ్రం ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ రవికుమార్‌ చెప్పారు. 

Updated Date - 2020-10-20T06:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising