ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సిబ్బందికి ఆర్థిక కష్టాలు

ABN, First Publish Date - 2020-08-06T11:10:31+05:30

వైద్య సిబ్బందికి ఆర్థిక కష్టాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు వేల మందికి అందని వేతనం

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులదీ అదే పరిస్థితి


ఏలూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వారంతా కరోనాతో యుద్ధం చేసి ప్రజలను రక్షిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధి తుల పక్షాన పోరాడుతూనే వైరస్‌కు చిక్కిన వారెందరో ఉన్నారు. ఆదివారం లేదు, పండుగ లేదు. సెలవులు లేవు. అయినా సరే వారు పట్టుదలతో పోరాటం చేస్తున్నా రు. అలాంటి వారికి వేతన కష్టాలు ఎదురయ్యాయి. రకరకాల కారణాలతో జిల్లాలోని సుమారు రెండు వేల మంది వైద్య సిబ్బందికి 1న ఇవ్వాల్సిన జీతం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అన్ని విభాగాల ప్రభుత్వోద్యోగులు, పెన్షనుదారులు, వలంటీర్లకు వేత నాలు అందాయి. ముందు వరుసలో ఉండి కరోనాతో పోరాడుతున్న వారికి మాత్రం ఇప్పటివరకూ అందలేదు. వైద్య విభాగంలో సేవలందించే సిబ్బందిలో కొంతమందికి 22(1) హెడ్‌ అకౌంట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు అందిస్తోంది. ప్రస్తుతం ఆ ఖాతాలో బడ్జెట్‌ లేదని తెలుస్తోంది. దీనితో వైద్య సిబ్బందిలో చాలామందికి వేత నాలు అందలేదు. వీరితోపాటు వివిధ విభాగాల్లో కీలక సేవలందిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు అందలేదు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యో గులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గందరగోళం ఏర్పడింది. వారు కూడా ఏపీ సీవోఎస్‌ ద్వారా ఉద్యోగాలు పొందాలని, ఇప్పటి వరకూ వారందించిన సేవలు కొన సాగించేందుకు వీలులేదని చెప్పడంతో జూలై ముగిసే వరకూ ఉద్యోగాలు ఉన్నదీ, ఊడింది తెలియలేదు. ఉద్యోగాల కోసం పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం వారిని కొనసాగించేందుకు ఓకే చెప్పినప్పటికీ, అప్పటికే ఆగస్టు వచ్చేసింది. వారి రెగ్యులరైజేషన్‌ వివరాలు జిల్లా వైద్యాధికారి ఖరారు చేయాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలోనే జిల్లా వైద్యాధికారులు కరోనా బారిన పడడంతో బిల్లులు పెండింగులో పడ్డాయి. జిల్లా వైద్యాధికారి, తర్వాత ఇన్‌చార్జిగా నియమితులైన అధికారి కొవిడ్‌ బారినపడడంతో బిల్లులు పెండింగులో ఉన్నాయి. అధికారులు కోలుకున్న తరువాత బిల్లులు ట్రెజరీకి పంపిస్తారా, లేక ప్రత్యామ్నాయం ఉందా అనే విషయం తేలాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది వేతనాల కోసం ఎదురు చూస్తు న్నారు. కొవిడ్‌పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బంది జీతాలు నిలిచి పోవడంతో వైద్య, ఉద్యోగ వర్గాల్లో ఆవేదన కలిగిస్తోంది. 


సకాలంలో వేతనాలు ఇవ్వాలి

కష్టాల కోర్చి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వాలి. కరోనాతో పోరాడేవారు వేతనాల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడంపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణం వేతనాలు చెల్లిస్తే వారి విధి నిర్వహణకు ఆటంకం కలగదు. వారి సేవలకు గుర్తింపు, ప్రోత్సాహం ఉంటే మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చు.   

- సీహెచ్‌.శ్రీనివాసరావు, ఏపీ ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2020-08-06T11:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising