భార్య గొంతు కోసిన భర్త
ABN, First Publish Date - 2020-11-04T05:17:56+05:30
అనుమానంతో భార్యపై కక్ష పెంచుకున్న భర్త కత్తితో గొంతుకోశాడు.
బుట్టాయగూడెం, నవంబరు 3: అనుమానంతో భార్యపై కక్ష పెంచుకున్న భర్త కత్తితో గొంతుకోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బుట్టాయ గూడెం మండలం తూర్పు రేగులకుంట గ్రామానికి చెందిన కుంజా రమేశ్ మద్యానికి బానిస కావడం.. భార్యపై అనుమానం ఉండడంతో తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. మద్యం విషయంలో సోమవారం రాత్రి కూడా గొడవ జరిగింది. కక్ష పెంచుకున్న రమేశ్ భార్య నిద్రిస్తున్న సమయంలో మంగళవారం తెల్లవారుజామున గీత కత్తితో పీక కోశాడు. భార్య కేకలు వేయడంతో తండ్రి, గ్రామస్థులు బాధితురాలిని 108లో ఏలూరు ఆసు పత్రికి తరలించారు. ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరావు భర్త రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య ముందుగా తానే గాయపర్చకున్నానని పోలీసులకు చెప్పినా తర్వాత భర్తే తనపై కత్తితో దాడిచేశాడని ఫిర్యాదు చేసింది.
Updated Date - 2020-11-04T05:17:56+05:30 IST