ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు సంక్షేమ ఫలాలు : మంత్రి రంగనాథరాజు

ABN, First Publish Date - 2020-12-30T04:24:37+05:30

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.

ఆచంట నియోజకవర్గంలో ఇళ్ల స్థల పట్టాలు అందజేస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట / పెనుగొండ, డిసెంబరు 29: ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు. పెనుగొండ మండలం దొంగగూడెం, మునమర్రు, వడలి గ్రామాల్లో 1194 మంది లబ్ధిదారులకు మంగళవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 18వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీచేసి త్వరలో ఇళ్లు నిర్మిస్తామన్నారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ పీడీ ఎన్‌.రామచంద్రరెడ్డి, చిన్నం రామిరెడ్డి, తిరుపతి పెద్దకాపు, సుంకర సీతారాం, వెలగల శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం రూరల్‌: మండలంలోని వేములదీవి గ్రామంలో ఐదు గ్రామాలు, పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రసాదరాజు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. మండలంలో 330, పట్ట ణంలో 400 మందికి పట్టాలందించారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బా రాయుడు, ఏఎంసీ చైర్మన్‌ స్వామి, ఎంపీడీవో ప్రసాద్‌యాదవ్‌, తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


భీమవరం రూరల్‌ / వీరవాసరం : భీమవరం మండలంలోని దిరుసుమర్రు, యనమదుర్రు గ్రామాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సుమారుగా 312 ఎకరాలను పేదల కోసం సేకరించడం జరిగిందని, భూసేకరణకు 139 కోట్లును ఖర్చు చేశామన్నారు. ఏఎంసీ ఛైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, తహసీల్దార్‌ ఏవీ.రమణరావు, ఎంపీడీవో జి.పద్మ, హౌసింగ్‌ ఏఈ రామకృష్ణంరాజు, కోళ్ళ బాలకృష్ణ, కొట్టి కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు.

వీరవాసరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరవాసరం, వడ్డిగూడెం, పెర్కిపాలెం, నందమూరుగరువు గ్రామాల లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాల ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. తహసీల్దార్‌ ఎం.సుందరరాజు, ఎంపీడీవో జి.స్వాతి, గూడూరి ఓంకార్‌, పోలిశెట్టి సత్యనారాయణ, గొలగాని సత్యనారాయణ, చికిలే మంగతాయారు, పాలా లక్ష్మీకుమారి పాల్గొన్నారు.


యలమంచిలి : మండలంలోని శిరగాలపల్లిలో మంగళవారం 348 మందికి ఇంటి స్థలాల పట్టాలను డీసీసీబీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తాతాజీ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మా ట్లాడుతూ సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకోదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు నిర్మించిన గృహాల (టిడ్కో గృహాలు)ను కొందరు వైసీ పీ నాయకులు పిచ్చిక గూళ్లు అని విమర్శించడం అవివేకం అన్నారు. ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌, తహసీల్దార్‌ ఎల్‌.నరసింహరావు, ఎంపీడీవో జి.రాజేంద్రప్రసాద్‌, చిలుకూరి సుబ్బారావు చౌదరి, పొత్తూరి బుచ్చిరాజు, కుమార దత్తాత్రేయ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising