ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనాడు.. మనోడే కాపాడాడు

ABN, First Publish Date - 2020-04-23T09:44:23+05:30

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్లేగుతో పాటు ఎన్నో వ్యాధులకు మందులు 

భీమవరం వాసి యల్లా ప్రగడ సుబ్బారావు ఘనత

 

భీమవరం టౌన్‌(పశ్చిమ గోదావరి): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు మందు కనిపెట్టని పరిస్థితి ఉంది. అన్ని రంగాల్లోను ప్రపంచం దూసుకుపోతున్న ఈ రోజుల్లో లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్న వైరస్‌ నివారణకు ఒక్క అడుగు ముందుకు పడని పరిస్థితి. అయితే సాంకేతికంగా అభివృద్ధి చెందని పూర్వ రోజుల్లోనే అప్పుడు పట్టిపీడిస్తున్న అనేక రోగాలకు మందులను కనిపెట్టి ఎంతో మందికి ప్రాణదానం చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో ప్రపంచ మానవాళి మనుగడకు ఎన్నో విలువైన మందులను కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్తగా మన జిల్లాలోని భీమవరానికి చెందిన యల్లా ప్రగడ సుబ్బారావు ముందు వరుసలో నిలుస్తారు.   


మన దేశంలోని సూరత్‌లో అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రబలుతున్న తరుణంలో సుబ్బారావు కనిపెట్టిన టెట్రాసైక్లిన్‌ మందు ద్వారా అరికట్టగలిగారంటే అతిశయోక్తి కాదు. ఎంతో పట్టుదలతో  ప్రయోగాలు చేసి పలు ఔషధాలను ప్రపంచానికి అందించారు. యల్లాప్రగడ సుబ్బారావు  1895 జనవరి 12న భీమవరంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పటినుంచి సన్యాసం స్వీకరించాలనే కోరిక ఉండేది. దీంతో ఆయన 13 ఏటనే ఇల్లు వదిలి కాశీ వెళ్లిపోయారు. అక్కడ ఆయన ఒక మఠంలో ఉంటూ అరటిపండ్లు అమ్ముకుంటూ ఉండేవారు.


ఇదిలా ఉండగా ఆయన తండ్రి, సోదరుడు కూడా స్ర్పూ వ్యాధితో చనిపోయారని తెలుసుకుని తిరిగి భీమవరం వచ్చేశారు. ఆ తర్వాత ఆయనకూ స్ర్పూ వ్యాధి సోకింది. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆచంట లక్ష్మీపతి వద్ద చికిత్స చేయించుకుని స్వస్థత పొందారు. ఈ సంఘటనలే ఆయనను వైద్యం వైపు మొగ్గు చూసేలా చేశాయి.  ఇటువంటి వ్యాధులకు మందులు కొనుగొనాలని, మానవాళి బాధపడకుండా సుఖ సంతోషాలతో బతకాలంటే తాను డాక్టర్‌ చదవాలని నిర్ణయించుకున్నారు. ఆపై అనేక కష్టాలు పడి సుబ్బారావు డాక్టర్‌ పట్టా సాధించారు. ఆయన అనేక పరిశోధనలు చేసి మద్రాసులో వైద్య కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. అనంతరం ఆయన ఒక కంపెనీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరారు. 1942లో డైరెక్టర్‌గా ప్రమోషన్‌ పొంది ఆయన తుది శ్వాస విడిచే వరకు అంటే 1948 ఆగస్టు 8 వరకు పరిశోధనలే ఊపిరిగా పని చేశారు. 


యల్లాప్రగడ కనిపెట్టిన మందులు

యల్లాప్రగడ తండ్రి, సోదరుడు స్ర్పూ వ్యాధితో మరణించడంతో ఆ వ్యాధికి మందును కనుగొన్నారు. అదే ఫ్లోరిక్‌ యాసిడ్‌. ఈ మందుతో ఈ తరం వారికి ఆ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది. బోదకాలు, హిస్నోఫీలియా వంటి వ్యాధులకు ఉపయోగించే హెట్రోజన్‌, క్షయ నివారణకు ఉపయోగిస్తున్న ఇనోనెక్స్‌, కలరా, టైఫాయిడ్‌, ప్లేగు, అతిసార వంటి వ్యాధులకు చికిత్సకు ఉపయోగిస్తున్న టెట్రాసైక్లిన్‌, చిన్నపిల్లలో బ్లడ్‌ కేన్సర్‌కు ఉపయోగిస్తున్న మోథాట్రెక్సేడ్‌ అనే మందులను ఆయన పని చేసిన లేడర్లే కంపెనీ తయారు చేసినవే. పెన్సిలిన్‌ను అతిచౌక ధరకు ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు. దీనివల్ల కోట్లాది రూపాయలు లాభాలు రావడంతో సుబ్బామైసిన్‌ అనే పేరు పెట్టి  కంపెనీ ప్రతినిధులు ఆయనకు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. 

Updated Date - 2020-04-23T09:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising