ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో అవకతవకలు

ABN, First Publish Date - 2020-02-20T06:49:20+05:30

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలను ఏసీబీ అధికారులు వెలికి తీశారు. గత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలను ఏసీబీ అధికారులు వెలికి తీశారు. గత రెండేళ్లలో భవన నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశా రు. పలు భవనాల అనుమతులు నమూనాలు తీసు కుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనుమతులకు భిన్నంగా అతిక్రమించి భవనాలు నిర్మించినా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తించారు. ఎఫ్‌సీఐ కాలనీలో ఒక భవ నం అనుమతి కంటే ఎత్తుగా నిర్మించినట్టు నిర్ధారిం చారు.


21వ వార్డులో ఒక అనధికార నిర్మాణం ఏసీబీ దృష్టికి వచ్చింది. వాణిజ్య నిర్మాణాలకు అనుమతి తీసుకుని నివాస భవనాన్ని నిర్మించారు. సెట్‌బ్యాక్స్‌ విడిచి పెట్టలేదు. అతిక్రమణపై పట్టణ ప్రణాళిక అధి కారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, సంబంధిత యజమానికి నోటీసులు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. పట్టణంలో అతిక్రమణలను నమోదు చేసుకున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధ వారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. 

Updated Date - 2020-02-20T06:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising