ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురిని కాపాడి.. తాను చనిపోయాడు!

ABN, First Publish Date - 2020-09-27T07:28:37+05:30

నలుగురు స్నేహితుల ప్రాణాలను కాపాడి.. తాను చనిపోయిన విషాద సంఘటన ఇది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. పందిరిమామిడిగూడెంకు చెందిన కంచర్ల....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. 

స్నేహితులను కాపాడి గల్లంతైన యువకుడి మృతి


బుట్టాయగూడెం, సెప్టెంబరు: నలుగురు స్నేహితుల ప్రాణాలను కాపాడి.. తాను చనిపోయిన విషాద సంఘటన ఇది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.  పందిరిమామిడిగూడెంకు చెందిన కంచర్ల రాము(39) బూరుగువాడకు చెందిన స్నేహితుడి కారులో మరో నలుగురు స్నేహితులతో కలిసి శుక్రవారం తెలంగాణ రాష్ట్రం ఆశ్వారావుపేట వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా భారీ వర్షం ప్రారంభమైంది. వేపులపాడు సమీపంలో పరికలవాగు ఉధృతి పెరిగింది. అయినా కారులో దాటుతుండగా వాగు ఉధృతికి 50 నుంచి 100 దూరం కొట్టుకుపోయి మట్టి దిబ్బ తగలడంతో ఆగింది. హమ్మయ్యా అనుకుంటూ కారు పక్కగా మట్టి దిబ్బ కనిపించడంతో డోర్లు తెరవడానికి డ్రైవింగ్‌ సీటులో ఉన్న రాము బయటకు వచ్చాడు. డోర్లు ఓపెన్‌ చేసి కారు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా వాగులో కొట్టుకుపోయాడు. కారులో మిగిలిన నలుగురు ఒక్కొ క్కరుగా బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. కళ్లెదుటే రాము గల్లంతుకావడంతో ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ రాత్రంతా వాగువెంబడి వెదికినా ఆచూకీ కానరాలేదు. శనివారం కంచెలో చిక్కుకు పోయి విగతజీవిగా రాము మృతదేహం పోలీసులకు చిక్కింది. శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2020-09-27T07:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising