ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌..లాస్‌!

ABN, First Publish Date - 2020-05-09T08:10:17+05:30

కరోనా కాటుకు... లాక్‌డౌన్‌ వేటుకు జిల్లాలోని వస్త్ర వ్యాపారం కుదేలైంది. చూసి చూసి సీజన్‌లో దెబ్బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాపారాలకు కరోనా దెబ్బ  

47 రోజులుగా మూత

వస్త్ర వ్యాపారానికి సీజనల్‌ ఎఫెక్ట్‌

హోటళ్లపై నిర్వహణ భారం

ఆందోళనలో వ్యాపారులు

వస్త్ర వ్యాపారులు కుదేలు


ఏలూరు, మే 8 (ఆంధ్రజ్యోతి) : కరోనా కాటుకు... లాక్‌డౌన్‌ వేటుకు జిల్లాలోని వస్త్ర వ్యాపారం కుదేలైంది. చూసి చూసి సీజన్‌లో దెబ్బ కొట్టింది. నిర్వాహకులకు ఆదాయం మాటేమోగానీ.. అద్దెలు, అప్పుల భారం వెంటాడుతోంది.మరో వైపు సిబ్బంది భారం కూడా మోయాలని ప్రభుత్వం ఆదేశించడంతో బెంబేలెత్తిపోతున్నారు.వైశాఖ మాసం లోనే పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ ఒక్క సీజన్‌లోనే వందలాది వివాహాలు జరుగుతాయి.బట్టల షాపులు కొనుగోలుదారులతో కిట కిటలాడేవి.పెళ్లంటే మాటలా..వధువు పట్టుచీర నుంచి పెళ్లి బట్టల వరకూ లక్షలాది రూపాయల వ్యాపారం సాగేది.ఈ నెల వ్యాపారం బాగా ఉంటే ఏడాదంతా గడిపేయ వచ్చనేది వ్యాపారుల నమ్మకం..అటువంటిది కీలక సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ ఏడాది వస్త్ర వ్యాపారులకు నష్టాలనే మిగల్చనుంది.జిల్లాలో సుమారు 7 వేల వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి సుమారు 10 వేల మంది యజమానులు, 25 వేల మంది సేల్స్‌మన్‌లు జీవిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి అమ్మేవారు మరో 15 వేల పైమాటే ఉంటారు. కరోనా కారణంగా ప్రస్తుతం వీరందరూ ఉపాధి కోల్పోయారు. ఇక వస్త్ర వ్యాపారుల షాపుల అద్దెలు భారీగానే ఉంటాయి. రూ. 10 వేల నుంచి రూ. లక్ష  పైచిలుకు అద్దెలు ఉన్న షాపులు కూడా ఉన్నాయి.ఈ నెలంతా వ్యాపారం లేక నిర్వహణ భారంగా  ఉంది. 


సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితిలో ఉన్నాం.. 

కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది. ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు. చైనా దాటి మనకు వరకూ వస్తుందనుకోలేదు. ఇప్పుడేం అర్ధం కావడంలేదు. ఏడాదంతా ఈ నెల గురించే ఎదురుచూస్తుంటాం.. ఎందుకంటే వైశాఖ మాసం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వస్త్ర వ్యాపారం భారీగా సాగుతుంది. అయితే ఈ ఏడాది సీజన్‌ అంతా పోయింది.తీవ్రంగా నష్టపోయాం. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. పన్నులు మినహాయించి ప్రభుత్వం ఆదుకోవాలి.  -  కత్తిరి రామ్మోహన్‌, వస్త్ర వ్యాపారి, ఏలూరు


హోటల్‌ వ్యాపారులు దిగాలు

తణుకు  : ఉదయం లేవగానే కడుపులో అల్పాహారం పడిపోవాల్సిందే.. మధ్యా హ్నం అయిందంటే భోజనం చేయాల్సిందే.. ఇక రాత్రికి ఇంతే.. దీంతో కరోనా లాక్‌డౌన్‌ ముందు వరకూ ఏ హోటల్‌ ఖాళీగా కనిపించేది కాదు.. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకూ రద్దీగానే ఉండేవి.వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగేది.జిల్లా వ్యాప్తంగా హోటళ్లు అన్నింటి పరిస్థితి ఇదే..అటువంటిది కరోనా దెబ్బకు హోటళ్లు మొత్తం లాక్‌ అయ్యాయి. ఇటీవల మిగిలిన వ్యాపారులకు సడలింపులు ఇచ్చినా హోటళ్లకు మాత్రం సడలింపులేదు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు, హోటళ్లు.. బిరియానీ పాయింట్లు సుమారు 2 వేల వరకూ ఉన్నాయు. పట్టణాలను బట్టి 30 నుంచి 50 వరకూ హోటళ్లు ఉంటాయి. సుమారు 47 రోజులుగా అన్నీ మూతపడి ఉన్నాయి. సెంటరును బట్టి రూ. 20 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకూ అద్దెలు ఉన్నాయి. సుమారుగా లక్ష మంది హోటళ్లపై ఆధారపడి పనిచేస్తున్నారు. వీరందరి ఉపాధిపై కరోనా దెబ్బ తీసింది. దీంతో అద్దెలు చెల్లించలేక.. కార్మికుల జీతాలివ్వలేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.  


ఆదాయం లేక.. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి.. 

నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. ఒకటా రెండా ఏకంగా 47 రోజులైంది హోటళ్లు తెరిచి.. నాకు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి..  వాటితో నేను వ్యాపారంలో చాలా బిజీగా ఉండేవాడిని.. లక్షల్లో వ్యాపారం సాగేది.. సుమారు 200 మంది పనిచేస్తున్నారు.. వారి జీతాలు.. రెస్టారెంట్ల అద్దెలు అన్నీ లెక్కవేసుకుంటే చాలా ఖర్చవుతుంది.. రూపాయి ఆదాయం లేదు..  ఖర్చు మాత్రం పెరిగింది. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.   

-  కెవి. సత్యనారాయణ మూర్తి, చంద్రిక హోటల్స్‌, భీమవరం


ఏప్రిల్‌లో సర్దుబాటు చేసుకున్నా.. ఇప్పుడెలా..

50 రోజులుగా హోటల్‌ మూసివేశాం.. ఇప్పుడు అద్దెలు చెల్లించమంటే ఎలా చెల్లించగలం.. అంతే కాకుండా విద్యుత్‌ బిల్లులు భారంగా మారాయి. నా వద్ద  25 మందికి పైగా రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. నెలకు రూ. 7 లక్షలకు పైగా వారికి వేతనాలు చెల్లించాలి. మొదటి నెలలో సర్దుబాటు చేసుకున్నా... ఇప్పుడు వారికి వేతనాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. -  వీ.వీ.కాశీ విశ్వేశ్వరరాజు, అభిరుచి రెస్టారెంట్‌, భీమవరం 


నెలకు నిర్వహణ ఖర్చు రూ. 7 లక్షలు...

లాక్‌డౌన్‌ మమ్మల్ని నట్టేట ముంచేసింది.. ఎప్పుడు తెరుస్తారో తెలియదు.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.. ఎన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదు. మా హోటళ్లో 60 మంది సిబ్బంది పనిచేస్తారు.. 50 రోజులుగా హోటళ్లు మూసివేయడం వల్ల వారికి వేతనాలు చెల్లించడానికి అష్టకష్టాలు పడుతున్నాం. ఆర్థికంగా ఒడిదుడుకలు ఎదుర్కొంటున్నాం. నెలకు రూ. 7 లక్షలకు పైగా ఖర్చు ఉంటుంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. 

- మలిశెట్టి సాయిబాబా, శ్రీదేవి హోటల్‌, భీమవరం


అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం

ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల యజమానుల పరిస్ధితి గడ్డుగానే ఉంది. పరిస్థితులు చేజారాయి. రెండు నెలల నుంచి వ్యాపారాలు లేకపోవడంతో అద్దెలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది.. ప్రతీ నెలా వచ్చే ఆదాయం నుంచే అద్దెలు చెల్లించేవాళ్లం.ఈ నెల దమ్మిడీ ఆదాయం లేదు.. యజమానులు చూస్తే అద్దెలు అడుగుతున్నారు.. ఏం చేయాలో తెలియడం లేదు. కొట్టుమిట్టాడుతున్నాం. మార్చి నెలలో 23 రోజులు వ్యాపారం సాగడంతో ఏప్రిల్‌ నెల పెండింగ్‌ లేకుండా చెల్లించేశా.. మే నెల గురించి ఆలోచిస్తున్నా.                                   

           - సనపల రమణ భాస్కరరావు, కృష్ణ హోటల్‌, తణుకు

Updated Date - 2020-05-09T08:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising