ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయం కోసం పెడమార్గం.. మద్యం కేసుల్లో యువత ..

ABN, First Publish Date - 2020-07-04T21:12:34+05:30

మద్యం అక్రమ రవాణా కేసుల్లో ఇటీవల యువతే ఎక్కువగా చిక్కుకుంటున్నారు. నలుగురైదుగురు కలసి మద్యం సీసాలను కొని అధిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు.. 

ఫోన్‌ల ద్వారా లావాదేవీలు 


ఏలూరు (ఆంధ్రజ్యోతి):మద్యం అక్రమ రవాణా కేసుల్లో ఇటీవల యువతే ఎక్కువగా చిక్కుకుంటున్నారు. నలుగురైదుగురు కలసి మద్యం సీసాలను కొని అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమ వరం, భీమడోలు, తాడేపల్లిగూడెం తదితర దాదాపు జిల్లాలోని అన్ని ప్రధాన పట్ట ణాలకు ఇలాంటి అక్రమాల్లో యువకులు భాగస్వామ్యం అవుతున్నారు. మధ్య తరగతి వర్గం మందు షాపుల ముందు క్యూల్లో నిలబడటానికి ఇబ్బంది పడుతుండటంతో వారిని టార్గెట్‌ చేసుకుని యువత ఈ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.


ప్రధానమైన బ్రాండ్లు షాపుల్లో దొరక్క పోవడంతో అలాంటి వాటిని వీరు చేజిక్కించుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఫోన్‌లు, వాట్సాప్‌ లలో సమాచారం అందించి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. వారనుకున్న రేటు వస్తేనే ఇస్తున్నారు. ఫోన్‌లో లావా దేవీలు పూర్తయిన తర్వాత ఒక ప్రాం తానికి రమ్మని అక్కడే మద్యం సీసాలను అందజేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న యువత తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేసి రహస్యంగా జిల్లాలోకి తరలిస్తున్నారు. వాటిని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో అమ్మే తెలంగాణ మద్యానికి సుమారు సగానికి సగం వ్యత్యాసం ఉండటంతో వీరికి అమ్మకం చాలా సులువవుతోంది. ఇటీ వల జరిగిన ఎక్సైజ్‌ దాడుల్లో కొత్తవారు కన్పించడం అధికారులను కలవరపెడుతోంది.   

Updated Date - 2020-07-04T21:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising