‘ఎంబుక్ నిర్వహణపై అవగాహన ఉండాలి’
ABN, First Publish Date - 2020-11-04T05:29:05+05:30
నిర్మాణాలకు సంబంధించి ఇంజనీరింగ్ సహాయకులకు ఎంబుక్ నిర్వహణపై పూర్తి అవగాహన ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్ కోరారు.
ఉంగుటూరు, నవంబరు 3 : నిర్మాణాలకు సంబంధించి ఇంజనీరింగ్ సహాయకులకు ఎంబుక్ నిర్వహణపై పూర్తి అవగాహన ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్ కోరారు. మంగళవారం కైకరం 1,2, నారాయణపురం సచివాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కార్యదర్శులు సచివాలయ రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కైకరం, నారాయణపురం సచివాలయ కార్యదర్శులు నీలం వెంకట శివప్రసాద్, బొడ్డు రవి చంద్ర కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-04T05:29:05+05:30 IST