ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ సేవలకు వసూళ్లా..?

ABN, First Publish Date - 2020-12-03T05:19:12+05:30

జిల్లాలో ప్ర భుత్వం గుర్తించిన కొన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా వైద్యం చేయ కుండా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) హిమాన్షు శుక్లా హెచ్చరించారు.

మాట్లాడుతున్న జేసీ హిమాన్షు శుక్లా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు.. పది రెట్ల జరిమానా  : జేసీ

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 2 : జిల్లాలో ప్ర భుత్వం గుర్తించిన కొన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా వైద్యం చేయ కుండా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) హిమాన్షు శుక్లా హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ కేసులకు ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే వసూలు చేసిన మొత్తానికి పది రెట్లు అధికంగా జరిమానా విధిస్తామని వెల్లడించారు. రెండోసారి ఫిర్యాదు వస్తే సంబంధిత ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవల అమలుకు సంబంధించి జిల్లాలో క్రమశిక్షణా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కమిటీకి చైౖర్మన్‌గా జేసీ(అభివృద్ధి), మెంబర్‌ సెక్రటరీగా డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌, కన్వీనర్‌గా ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ ఉంటారని తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులపై జిల్లాస్థాయిలో ఈ కమిటీ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేఎం సునంద, ఇన్‌ఛార్జి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌   డాక్టర్‌ టీ ఆండ్రూ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising