ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారుల నిర్మాణం చేపట్టండి

ABN, First Publish Date - 2020-11-04T04:43:48+05:30

అధ్వానంగా ఉన్న రహదారులు తక్షణం బాగు చేయాలని జనసేన ఆచంట నియోజకవర్గ ఇన్‌చార్జి చేగొండి సూర్యప్రకాశ్‌ అన్నారు.

పెనుగొండ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న సూర్యప్రకాశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ/పెనుమంట్ర, నవంబరు 3: అధ్వానంగా ఉన్న రహదారులు తక్షణం బాగు చేయాలని జనసేన ఆచంట నియోజకవర్గ ఇన్‌చార్జి చేగొండి సూర్యప్రకాశ్‌ అన్నారు. గోతులు, రాళ్లతో అస్తవ్యస్తంగా ఉన్న మార్టేరు – పెనుగొండ రహదారిపై మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. రహదారులు అస్తవ్యస్థంగా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ముందుగా మార్టేరు సెంటర్‌లోని జాతీయ నాయకుల విగ్రహాలకు పూల మాలలువేసి పెనుగొండ వరకు పాదయాత్ర నిర్వహించారు. శాశ్వత సీసీ రోడ్డు నిర్మిం చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పెనుగొండ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో షేక్‌ మహ్మద్‌ ఆలీ, చిట్టూరి శ్రీనివాస్‌, జవ్వాది బాలాజీ, కొప్పుల అంజనీకుమార్‌, పప్పుల అంజనీ, వెంగళ దాసు, దానయ్య, దారలంక మారుతీ, అడ్డాల దుర్గారావు, అడ్డాల మధు, తోట తాతాజీ, తోట సురేంద్ర, తోట సతీష్‌,రావి హరిష్‌, నంబూరి విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-04T04:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising