ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర జలజీవన్‌ మిషన్‌ బృందం పర్యటన

ABN, First Publish Date - 2020-12-06T05:44:43+05:30

జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం శనివారం జిల్లాలో పర్యటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం శనివారం జిల్లాలో పర్యటించింది. తొలుత కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజును కలిసిన బృందం సభ్యులు పథకం అమలు గురించి ఆయనతో చర్చించారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు వంద రోజుల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వడంపై వారు ఆరా తీశారు. అనంతరం ద్వారకా తిరుమల మండలంలోని కోడిగూడెం, పెదపాడు మండలంలోని ఏపూరు గ్రామాలలో బృందం పర్యటించి పథకంలో భాగంగా చేపట్టిన పను లను పరిశీలించారు. పర్యటనలో జలజీవన్‌ మిషన్‌ టెక్నికల్‌ అడ్వయిజర్‌ జే మురళీధరన్‌, సభ్యులు అబ్దార్‌ ఖాన్‌తో పాటు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జేవీ రాఘవులు, ఏలూరు, కొవ్వూరు డివిజన్ల డీఈఈలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T05:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising