ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌-19 వ్యాప్తిపై ఇంటింటా సర్వే

ABN, First Publish Date - 2020-06-02T09:26:51+05:30

గ్రామాల్లో కొవిడ్‌-19 ఐదో విడత సర్వే వలం టీర్లు, ఆశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యలమంచిలి, జూన్‌ 1: గ్రామాల్లో కొవిడ్‌-19 ఐదో విడత సర్వే వలం టీర్లు, ఆశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి నమోదు చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి న వారి వివరాలను తక్షణమే తమకు కానీ, ఆరోగ్య సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు.


కరోనా వ్యాప్తిపై అధికారుల విచారణ

వీరవాసరం: వీరవాసరంలో కరోనా అనుమానిత కేసులు వెలుగు చూడడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి గోవర్థన్‌ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నుంచి సోమవారం సమాచారాన్ని తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తి ఏ ప్రాంతానికి చెందనివా రు, కరోనా ఎలా సోకింది, ఎక్కడ సంచరించారు వంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారి బి.నాగనందిని, సిబ్బంది పాల్గొన్నారు.


రెడ్‌జోన్‌ ప్రాంతాన్ని సందర్శించిన డీఎస్పీ

నరసాపురం రూరల్: మండలంలోని ఎల్‌బీ.చర్ల, మోడి గ్రామాలలో డీఎస్పీ నాగేశ్వరరావు సోమవారం పర్యటించారు. రెండు రోజుల క్రితం మోడి గ్రామంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం విదితమే. దీంతో అధికారులు ఈ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రెడ్‌జోన్‌లోకి ఎవరూ వెళ్లకుండా మూసివేయాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఐ కృష్ణమోహన్‌, ఎస్‌ఐలు ప్రియకుమార్‌, హరి ఉన్నారు.

Updated Date - 2020-06-02T09:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising