ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాల్లో మౌలిక

ABN, First Publish Date - 2020-08-11T10:48:13+05:30

జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానశాఖ ఆక్వా రంగాల్లో రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, సరఫరా, రైతులకు రుణాలు పంపిణీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వసతుల కల్పనకు జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ


ఏలూరు సిటీ, ఆగస్టు 10 : జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానశాఖ ఆక్వా రంగాల్లో రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, సరఫరా, రైతులకు రుణాలు పంపిణీ తదితర మౌలిక వసతులు ఏర్పాటుకు జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చెప్పారు. కలెక్టర్‌ కార్యా లయంలో  సోమవారం వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. గ్రామ స్థాయిలో యాంత్రీకరణ కస్టమ్‌ హెయిర్‌ సెంటర్ల ద్వారా రైతులకు అవసరమైన యంత్రాల వివరాలు త్వరితగతిన తెలుసుకుని నివేదిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ జేడీ గౌసియాబేగంను ఆదేశించారు.


అక్టోబరు 2వ తేదీన రైతు భరోసా కేంద్రాలలో యాంత్రీకరణ కస్టమ్స్‌ సెంటర్లును ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హబ్స్‌లో పేర్లు నమోదు చేసుకున్న రైతు గ్రూపులకు రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారని, 40 శాతం ప్రభుత్వ సబ్సిడీ కాగా, 50 శాతం రుణం, 10 శాతం రైతుగ్రూపుల వాటాగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో కలెక్టర్‌, జేసీ చైర్మన్‌లుగా, వ్యవసాయ శాఖ జేడీ మెంబర్‌ సెక్రటరీగా, ఉద్యానశాఖ డీడీ కో మెంబర్‌ సెక్రటరీగా, పశు సంవర్థక శాఖ డీడీ, మత్స్య శాఖ డీడీ, సెరీకల్చర్‌,  ఆగ్రోస్‌ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు.   సమావేశంలో జేసీ కె. వెంకటరమణారెడ్డి, సంబంధిత శాఖల  జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T10:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising