ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై కనిపిస్తే కేసు

ABN, First Publish Date - 2020-03-27T11:05:53+05:30

లాక్‌డౌన్‌ అమలుతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లుపై ఎవరు కన్పించినా 1897

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏలూరులో ఎస్పీ సుడిగాలి పర్యటన


ఏలూరు క్రైం,  మార్చి 26 : లాక్‌డౌన్‌ అమలుతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లుపై ఎవరు కన్పించినా 1897 ఎపిడెమిక్‌ డిసీజ్‌ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ  నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌ హెచ్చరించారు. ఏలూరు నగరంలో గురు వారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పోలీసులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. ఫైర్‌స్టేషన్‌, ఆర్‌ఆర్‌పేట, అమీనాపేట, పాత బస్టాండ్‌, జ్యూట్‌మిల్లు, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి లాక్‌డౌన్‌ అమలును పరిశీలించారు. ప్రజలు యధేచ్ఛగా తిరగడాన్ని గమనించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.


ఏలూరు కోర్టు సెంటర్‌ వద్ద జనరల్‌ షాపుకు మెడికల్‌ షాపుగా బోర్డు పెట్టడంతో కేసు నమో దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు, కూర గాయలు కొనుగోలు చేసుకోవాలన్నారు. ఇంటికి ఒకరు మాత్రమే బయ టకు రావాలన్నారు. మోటారు సైకిల్‌పై ఒకరు, కారులో ఇద్దరు మాత్ర మే ప్రయాణించాలన్నారు. ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధి దాటకూడదని, కరోనా నివారణకు ప్రజల సహకారం అవసరమన్నారు. 

Updated Date - 2020-03-27T11:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising