ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతికందొచ్చిన పంట అమ్మే దారేది...!

ABN, First Publish Date - 2020-03-29T10:46:42+05:30

కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రైతుల బతుకులు అతలాకుతలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌తో రైతుల బతుకులు అతలాకుతలం


దేవరపల్లి/ దెందులూరు/ లింగపాలెం, మార్చి 28 :  కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రైతుల బతుకులు అతలాకుతలం అయ్యాయి. పంట ఉత్పత్తులు ఎగుమతి కాక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దేవరపల్లి మండలంలో అరటి, మొక్కజొన్న, పామాయిల్‌ రైతులు పంట చేతికొచ్చినా ఉప యోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి గెలలు మార్కెట్‌కు వెళ్లే మార్గం లేక చెట్ల మీదే పండిపోతున్నా యంటూ అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. పామాయిల్‌ ఫ్యాక్టరీలు మూసివేయడం మొక్కజొన్న కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


ప్రతీ పంటను మార్కెట్‌ యార్డుల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను అన్ని విధాలా ఆదుకోవా లని రైతులు కోరుతున్నారు. దెందులూరు మండ లంలో అరటి పంట చేతికి వచ్చినా పంటకొనే నాథుడు లేక పంట తోటలోనే పండిపోతోంది. రామారావు గూడెం, మేదిన రావుపాలెం, కొత్తకమ్మ వారిగూడెం, పాతకమ్మవారిగూడెం, పెరుగూడెం, తదితర గ్రామాల్లో పంటకొచ్చిన అరటి పంట పండి పోతోంది.   శనివారం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నేత కె.శ్రీనివాస్‌  అరటి తోటలను పరిశీలించారు.ప్రభుత్వం వెంటనే రైతుల వద్ద నుంచి అరటి పంటను కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లింగపాలెం మండ లంలో చేతికందిచ్చిన అరటి పంట కళ్ల ముందే కుళ్లి పోతోందంటూ కరోనా ఎఫెక్టుతో  పలువురు రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కలరాయిన గూడెం పంచాయతీ యర్రావారిగూడెం గ్రామానికి చెందిన యర్రా శివరామకృష్ణ తనకున్న ఐదు ఎకరాల్లో రూ.నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి కర్పూరం అరటిని సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో కరోనా ప్రభావంతో కొనేనాథుడు లేక తోటలోనే అరటి గెలలు మగ్గిపోయి కుళ్లి పోతున్నాయి. తామే మార్కెట్‌కి తీసుకెళ్లదామన్నా బయటకు రానివ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా దెబ్బతో నిలువునా నష్టపోయామని ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2020-03-29T10:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising