ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాలు సిద్ధం చేయండి

ABN, First Publish Date - 2020-12-04T04:53:20+05:30

ఇళ్ల స్థలాలను సిద్ధం చేయాలని మండల అధికారులను జాయింట్‌ కలెక్టరు వెంకటరమణారెడ్డి ఆదేశించారు.

చెరుకువాడలోని ఇళ్ల స్థలాలను పరిశీలిస్తున్న జేసీ, సబ్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాయింట్‌ కలెక్టరు వెంకటరమణారెడ్డి 


ఉండి, డిసెంబరు 3: ఇళ్ల స్థలాలను సిద్ధం చేయాలని మండల అధికారులను జాయింట్‌ కలెక్టరు వెంకటరమణారెడ్డి ఆదేశించారు. ఎన్‌ఆర్‌పి.అగ్రహారం, పాము లపర్రు, వెలివర్రు, చెరుకు వాడ, ఉండి గ్రామాలలో ఇళ్ల స్థలాలను జేసీ వెంకట రమణారెడ్డి, సబ్‌ కలెక్టరు కె.విశ్వనాథన్‌ గురువారం పరిశీలించారు. పేదలకు  ఇవ్వడానికి సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లే అవుట్ల విషయమై అధికారులకు సూచన లు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ సెంటర్స్‌పై సమీక్షించారు. పూడిక పనులు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు కృష్ణజ్యోతి, ఎంపీడీవో గంగాదరరావు, ఈవోపీఆర్‌డీ కొండలరావు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ కార్యదర్సులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


జడ్పీ సీఈవో పరిశీలన

ఆచంట, డిసెంబరు 3 : అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందజేసేందుకు పట్టాలు సిద్ధం చేయాలని జడ్పీ సీఈవో పి.శ్రీనివాసరావు అన్నారు. కొడమంచిలిలోని లే అవుట్‌లను, సచివాలయంతో పాటు పలు భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈనెల 25న ఇచ్చే ఇళ్ల స్థలాలు పంపిణీలో భాగంగా లే అవుట్‌లను శుభ్రం చేసి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంపీడీవో ఎన్‌.శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మూర్తిరాజు, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising