నిషేధించినా..అమ్మేస్తున్నారు..
ABN, First Publish Date - 2020-12-12T04:27:05+05:30
ఏలూరులో రెండు షాపులపై ఎస్‌ఈబీ, వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి రూ. 4.5 లక్షల విలువైన నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
రూ. 4.5 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత
ఏలూరు క్రైం, డిసెంబరు 11 : ఏలూరులో రెండు షాపులపై ఎస్‌ఈబీ, వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి రూ. 4.5 లక్షల విలువైన నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు వన్‌టౌన్‌లోని లక్ష్మీ ఏజెన్సీ, విజయ స్టోర్స్, శ్రీ లక్ష్మీ స్వీట్స్ జనరల్ స్టోర్‌లో ఖైనీ, గుట్కా ప్యాకెట్లు విక్రయాలు జరుగుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఆ షాపులపై దాడి చేసి మొత్తం 60 వేల 177 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు పుప్పాల రమేష్, పాలేటి సుధాకర్, పల్లి సుధాకర్‌లను అరెస్టు చేశారు.
Updated Date - 2020-12-12T04:27:05+05:30 IST