ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ.. గోదావరి వరద

ABN, First Publish Date - 2020-08-22T11:33:09+05:30

గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. పోల వరం వద్ద శుక్రవారం సాయంత్రానికి 25.987 మీటర్లకు పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికీ ముంపులోనే లంక గ్రామాలు

వణికిపోతున్న తీర ప్రాంత ప్రజలు


పోలవరం, ఆగస్టు 21: గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. పోల వరం వద్ద  శుక్రవారం సాయంత్రానికి 25.987 మీటర్లకు పెరిగింది. రాత్రికి మరింత పెరిగే అవకాశాలున్నాయని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. నక్లెస్‌ బండ్‌ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు చేపట్టారు. కమ్మరగూడెం వద్ద రెవెన్యూ అధికారులు మళ్లీ వేసిన ఇసుక బస్తాల నుంచి వరద జలాలు గ్రామంలోకి ప్రవేశించడం ప్రారంభించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.


మళ్లీ ముంచుతున్న వరద

కుక్కునూరు/వేలేరుపాడు: వరద నీటిలో నాలుగు రోజులుగా నానుతున్న ఇళ్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వరద కొంత తొలగడంతో ఇంటి నిండా మట్టి పేరుకుపోవడంతో అడుగు పెట్టలేని  పరిస్థితి నెలకొంది. చాకలి బజారు, మంగళి బజారు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. మరోసారి వరద రావడంతో ఇళ్లు కూలిపోతాయని ముంపు బాధితులు ఆందోళన చెందుతున్నారు. వేలేరుపాడు మండలంలో పక్కా గృహాల కంటే పూరిళ్లు అధికం. వేలేరుపాడు, తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, రుద్రమకోట గ్రామాల్లో పూరిళ్లు ఇప్పటికే కూలిపోయాయి.


మారిన ముంపు లెక్కలు

అధికారుల నివేదిక ప్రస్తుతం జరిగిన ముంపునకు వ్యత్యాసం స్పష్టం కనిపిస్తోంది. పలు గ్రామాలు ముంపులో లేవని ప్రకటించగా ఆ గ్రామాల్లో వరద నీరు చేరింది. ముంపు జాబితాలో లేని కుక్కునూరు వంజంవారిగుంపు వరదలో ఉంది. భద్రాచలం వైపు రహదారి దాదాపు ఆరు చోట్ల నీట ముని గింది. అధికారులు గోదావరి నీటి మట్టం ప్రకారం ప్రకటించిన జాబితాకు ప్రస్తుతం జరిగిన ముంపునకు పొంతన లేకుండా పోయింది.


ముంపులోనే లంక గ్రామాలు 

ఆచంట/యలమంచిలి: వరద గోదావరి స్వల్పంగా తగ్గినప్పటికి శుక్రవారం నిలకడగా ఉంది. మరోవైపు మళ్లీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తమ వుతోంది. లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వారం రోజులుగా ముంపులో ఉన్న లంకవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంక గ్రామాల్లో నాటుపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వారం రోజులుగా ప్రభుత్వ సాయం అందలేదని లంకవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యలమంచిలి లంక గ్రామాలు ఐదురోజులుగా వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాలు నేటికీ ముంపులోనే ఉన్నాయి. వరద నీరు తగ్గినా ఇళ్లలో పేరుకు పోయిన బురద తొలగించుకునే పనులు చేస్తున్నారు. డొల్లావారిపేట, ముస్కూడివారిపేటల్లో తాగేందుకు నీరు కూడా లభించడం లేదని, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆప్రాంత వాసులు వాపోతున్నారు. దొడ్డిపట్ల వద్ద బలహీనపడిన గోదావరి ఏటిగట్టుకు గండి పడకుండా ఇసుక బస్తాలతో, మట్టి బస్తాలతో పటిష్టం చేశారు. లక్ష్మీపాలెం తదితర ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్టం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తాళ్లపూడి/పెరవలి: గోదావరి వరద తగ్గుముఖం పట్టినా శుక్రవారం తిరిగి ఉగ్రరూపం దాల్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇసుక ర్యాంపులలో తవ్వకాలు వద్దని తాళ్ళపూడి తహసీల్దారు నర్శింహమూర్తి హెచ్చరించారు. పెరవలి లంక భూముల్లో పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందు తున్నారు. గోదావరి మళ్లీ పెరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-22T11:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising