ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా సొమ్ము వెనక్కి తీసుకోండి

ABN, First Publish Date - 2020-06-28T10:37:29+05:30

తన వ్యవసాయ భూమి విక్రయించానని, తాను రైతును కాదని తనకు అందిన రైతు భరోసా సొమ్ము వెనక్కి తీసుకోవాలని కలెక్టర్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాను రైతును కాదని కలెక్టర్‌కు వినతి


వీరవాసరం, జూన్‌ 27: తన వ్యవసాయ భూమి విక్రయించానని, తాను రైతును కాదని తనకు అందిన రైతు భరోసా సొమ్ము వెనక్కి తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం పంపించారు వీరవాసరం మండలం ఉత్తరపాలేనికి చెందిన వడ్డి సుబ్బారావు. అతడి భార్య బ్యాంకు ఖాతాలో గత నెలలో  రైతుభరోసా సొమ్ము రూ.5,500 సొమ్ము జమ అయింది. ఖాతా పరిశీలిస్తే గత ఏడాది అక్టోబర్‌లో 9,500 సొమ్ము జమ అయింది. మొత్తం రూ.15 వేలు వెనక్కి తీసుకోవాలని కోరాడు. వడ్డి సూర్యకుమారి పేరున ఆర్‌ఎస్‌ నెంబర్‌ 118/8ఎలో 0.1450 సెంట్లు భూమి ఉంది. ఈ భూమిని ఎప్పుడో విక్రయిం చేశారు.


భూమి క్రయ విక్రయాలకు సంబంధించి అడంగల్‌లో నమోదు కాకపోవడంతో రైతు భరోసా సొమ్ము సూర్యకుమారి పేరున ఆమె ఖాతాలో జమ అయ్యింది. దీనిని అధికారులు ఎవరూ గుర్తించలేదు. ఆమె పేరున వచ్చిన రైతు భరోసా సొమ్మును ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తామంటూ వడ్డి సుబ్బారావు కలెక్టర్‌కు వినతిపత్రం పంపడం గమనార్హం. దీనిపై వ్యవసాయ శాఖ ఏడీఏ ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ భూమి క్రయ విక్రయాలపై అడంగల్‌లో మార్పులు చేర్పులు జరగాలని, విక్రయించినవారు కొనుగోలు చేసిన వారికి ఈ బాధ్యత ఉంటుందన్నారు. అడంగల్‌లో మార్పులు చేర్పులు జరగపోవడం వలన ఆన్‌లైన్‌లో 1బి దాఖలా మార్పులు చేయకపోవడం వలన రైతు భరోసా సొమ్ము జమ అయి ఉంటుందన్నారు.

Updated Date - 2020-06-28T10:37:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising