ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఉచిత రేషన్‌

ABN, First Publish Date - 2020-07-03T10:41:07+05:30

రేషన్‌ షాపుల్లో సరుకులు తీసుకోవడానికి బయోమెట్రిక్‌ వినియోగంపై ఆందో ళన వ్యక్తమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయోమెట్రిక్‌ తప్పనిసరి


తణుకు/ఏలూరు సిటీ, జూలై 2: రేషన్‌ షాపుల్లో సరుకులు తీసుకోవడానికి బయోమెట్రిక్‌ వినియోగంపై ఆందో ళన వ్యక్తమవుతోంది. అసలే కరోనా విజృంభిస్తున్న వేళ.. ఒక్కోషాపులో వందలాది మంది కార్డుదారులు వేలిముద్ర లు వేయడం వల్ల ఎవరికి ఏ విధమైన ప్రమాదం ముం చుకొస్తుందో తెలియని పరిస్థితి. రోజూ వందల్లో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో బయోమెట్రిక్‌ తీసివేయాలని రేషన్‌షాపు డీలర్లు, కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతు న్నారు. డీలర్‌ లేదా అధికారి వేలిముద్రతో సరుకులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే కొంత వరకూ వైరస్‌ నివారించవచ్చు. దీని పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.


జిల్లాలో ఏడో విడత ఉచిత రేషన్‌ పంపిణీ శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పౌర సరఫరాలశాఖ జిల్లా అధికారి ఎన్‌.సుబ్బరాజు తెలిపారు. బియ్యం, కందిపప్పు ఉచితంగాను, పంచదార అర కేజీ 17 రూపాయలకు, అంత్యోదయ కార్డులకు రూ.13.50లకు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో 12 లక్షల 74 వేల 240 కార్డులకు సరుకులు సరఫరా చేస్తామన్నారు. కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా ప్రతి చౌక ధరల దుకాణం ఆవర ణలో రెండు మీటర్ల భౌతిక దూరం పాటించి, మార్కింగ్‌ చేసి, కార్డుదారులు ఆ మార్కింగ్‌లో ఉందే విధంగా డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి స్లాట్‌కు ఐదు నుంచి పది మంది కార్డుదారులకు మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2020-07-03T10:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising